త్రిష టైపు లో పూజా హెగ్డే కూడా !
టాలీవుడ్ బుట్ట బొమ్మగా మొన్నటి వరకు చాలా స్టార్ హోదాతో మెరిసిపోయిన పూజా హెగ్డే ప్రస్తుతం మాత్రం అంతగా గుర్తింపునందుకోవడం లేదు
By: Tupaki Desk | 9 Dec 2023 11:30 PM GMTటాలీవుడ్ బుట్ట బొమ్మగా మొన్నటి వరకు చాలా స్టార్ హోదాతో మెరిసిపోయిన పూజా హెగ్డే ప్రస్తుతం మాత్రం అంతగా గుర్తింపునందుకోవడం లేదు. ఆమెకు ఇటీవల కాలంలో వచ్చిన డిజాస్టర్లు కెరీర్ పై గట్టి ప్రభావం అయితే చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. పూజా హెగ్డే మొదట్లో కూడా కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి కానీ వాటి నుంచి ఆమె తొందరగానే బయటపడింది.
ఎప్పుడైతే అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేసిందో అప్పటినుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలతో కూడా రేంజ్ పెరిగిపోయింది. వెంట వెంటనే ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో ఆమె సినిమా చేసే అవకాశాలు అందుకుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ హీరోలతో ఆమెకు అవకాశాలు రావడం లేదు. రాదేశామ్ ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా గట్టిగానే దెబ్బ కొట్టాయి.
ముఖ్యంగా బాలీవుడ్లో సల్మాన్ తో చేసిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా కూడా ఊహించని రేంజ్ లో ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్నంత స్థాయిలో అయితే అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ లోనే కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. అక్కడ షాహిద్ కపూర్ రన్వీర్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తోంది.
ఇక తెలుగులో అయితే ఆఫీషియల్ గా ఓకే అయిన ఒకే ఒక్క సినిమా సాయిధరమ్ తేజ్ గాంజా శంకర్. అలాగే రవితేజ హరిష్ శంకర్ సినిమాకు కూడా ఈ బ్యూటీ ని అనుకుంటున్నప్పటికీ ఇంకా ఆ విషయంలో క్లారిటీ అయితే రాలేదు. ఇక గాంజా శంకర్ కూడా స్టార్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా పూజ పాప స్టార్ ఇమేజ్ అంతగా వెలిగిపోవడం లేదు.
కాబట్టి ఇప్పుడు ఆమెకు సరైన సక్సెస్ అయితే ఒకటి పడాలి. చేతిలో ఉన్న సినిమాలలో ఏది సక్సెస్ అయినా కూడా కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. త్రిష లాంటి హీరోయిన్స్ కూడా కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్న సమయంలో మళ్ళీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇక పూజకు అంత వయసు కూడా పెరిగిపోలేదు కాబట్టి మంచి కంటెంట్ ఉన్న కొన్ని చిన్న సినిమాలు చేస్తే కూడా ఆమె కెరీర్ మల్లి ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఆమె సెలక్షన్ ఎలా ఉంటుందో.