బుట్టబొమ్మని మించిన అందం నీ సొతం!
ఫ్యాషన్ వరల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెషలిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు
By: Tupaki Desk | 30 May 2024 3:49 AM GMTఫ్యాషన్ వరల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెషలిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మడి ఎంపికలు అమెలో బ్యూటీని అంతకంతకు హైలైట్ చేస్తుంటాయి. కటౌట్ కి తగ్గట్టు సొగసరి ఎంపిక చేసుకునే దుస్తులే అమ్మడి అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. హైట్..వెయిట్ కి తగ్గట్టు కట్టుబొట్టు ప్రతీ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటుంది. డిజైనర్ దుస్తులైనా...సంప్రదాయ వస్త్రాలైనా బుట్టబొమ్మ ధరించిందంటే ఆ దుస్తులకే వన్నె వచ్చేస్తుంది.
తాజాగా పూజాహెగ్డే మరోసారి అందాన్ని రెట్టింపు చేసే దుస్తుల్లో తళుక్కున మెరిసింది. ఇదిగో ఇక్కడిలా గాగ్రా చోలీ డిజైన్ ని పోలిన దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబైంది. అమ్మడి అలంకరణ ప్రతీది బుట్టబొమ్మని సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాయి. పసుపు బాటమ్ పై మ్యాచింగ్ క్రీమ్ కలర్ షోల్డర్ లెస్ బ్లౌజ్..మెడలో మెరిసిపోతున్న హారం ..మ్యాచింగ్ పాపిడి బొట్టు.,.ముఖంలో చిరునవ్వు..కళ్లలో హవభావాలు ప్రతీది బుట్టబొమ్మకే ఆ అందమంతా సొంతమన్న తీరున కనిపిస్తుంది.
వివిధ భంగిమల్లో కెమారికి ఇచ్చిన ఫోజులు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఓ పిక్ లో చేతిలో కుక్క పిల్ల తో క్లిక్ మనిపించిన పిక్ పిల్లల్ని సైతం ఆకర్షిస్తుంది. ప్రతీ స్నాప్ ఎంతో అందంగా కనిపిస్తుంది. అందమంతా నా సొంతమే అన్నట్లు కుర్రాళ్ల హృదయాల్ని ఛిద్రం చేసే ఫోటో షూట్ అనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బుట్టబొమ్మ అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందా? అన్న ఎగ్జైట్ మెంట్ తెలుగు యువత నుంచి కనిపిస్తుంది.
అందుకు ఎంతో సమయం లేదు. ఇప్పటికే నాగచైతన్యకి జోడీగా ఓ సినిమాలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రయత్నాలు తర్వాత అమ్మడికి వచ్చిన అవకాశం అది. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆమె సైతం ఎదురు చూస్తుంది. బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి పని చేస్తోన్న సంగతి తెలిసిందే.