Begin typing your search above and press return to search.

వీడియో: బుట్ట‌బొమ్మ‌లో ఎన్నెన్ని కోణాలు

ఒక క్ష‌ణం మిడ్డీలో క‌నిపించినా, మ‌రుక్ష‌ణం చీర‌లో క‌వ్వించినా, లేదా డిజైన‌ర్ ఫ్రాకుల్లో మ‌తులు చెడ‌గొట్టినా కొంటె పూజా అందానికి ఫిదా కాని వాళ్లే లేనే లేరు.

By:  Tupaki Desk   |   1 July 2024 4:36 AM GMT
వీడియో: బుట్ట‌బొమ్మ‌లో ఎన్నెన్ని కోణాలు
X

అవును.. బుట్ట‌బొమ్మ‌లో ఎన్నెన్ని కోణాలు...! అందంతో చిరున‌వ్వుతో ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డ‌మే కాదు.. అందంగా క‌వ్విస్తూ.. ఆనందక‌ర జీవ‌న‌శైలిని కొన‌సాగిస్తూ.. ఈ బ్యూటీ ఇంకా ఇంకా అందంగా మారుతోంది. టోన్డ్ లుక్ తో కిక్కు పెంచ‌డంలోను పూజాని కొట్టేవాళ్లే లేరు!

తాజాగా రిలీజైన ఇన్ స్టా వీడియోలో పూజా స్టన్నింగ్ లుక్స్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. బుట్ట బొమ్మ‌లో ఇన్ని కోణాలు దాగున్నాయా? అంటూ అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఒక క్ష‌ణం మిడ్డీలో క‌నిపించినా, మ‌రుక్ష‌ణం చీర‌లో క‌వ్వించినా, లేదా డిజైన‌ర్ ఫ్రాకుల్లో మ‌తులు చెడ‌గొట్టినా కొంటె పూజా అందానికి ఫిదా కాని వాళ్లే లేనే లేరు.

వీడియోకి వాట్ ఈజ్ లైఫ్ విత‌వుట్ నాదానియా? అనే సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చిన పూజా ఆశ్చ‌ర్యం క‌లిగించే ఈమోజీల‌ను షేర్ చేసింది. పూజా ఇటీవ‌లి వ‌రుస ఫోటోషూట్ల నుంచి మాష‌ప్ వీడియో ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. కొద్దిరోజులుగా అండ‌మాన్ నికోబార్ దీవుల్లో విహ‌రించిన పూజా హెగ్డే అక్క‌డి నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేసింది. బీచ్ లో యోగాస‌నాల ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. త‌దుప‌రి త‌మిళ స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించ‌నున్న ఈ భామ దానికి త‌గ్గ‌ట్టుగానే 4 కోట్ల‌ పారితోషికం డిమాండ్ చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ స‌ర‌స‌న దేవా అనే చిత్రంలోను పూజా న‌టిస్తోంది.