Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే.. సగం చొక్కాలో వయ్యారంగా..

సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ నిత్యం కొత్తగా స్టిల్స్ ఇస్తూ, స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు

By:  Tupaki Desk   |   12 Aug 2024 12:13 PM GMT
పూజా హెగ్డే.. సగం చొక్కాలో వయ్యారంగా..
X

సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ నిత్యం కొత్తగా స్టిల్స్ ఇస్తూ, స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ‘దువ్వాడ జగన్నాధం’తో పాటు పలు భారీ చిత్రాల్లో నటించి, స్టార్ హీరోయిన్‌గా మొన్నటివరకు బాగానే కొనసాగింది.

అయితే, ఇటీవల బాలీవుడ్ లో తన సత్తా చాటాలని ప్రయత్నించినా, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లు నిరాశపరచడంతో, పూజకు కొన్ని అనుకున్న అవకాశాలు చేజారిపోయాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ‘రాధే శ్యామ్’ మరియు ‘ఆచార్య’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. అయితే, తన కెరీర్ లో వచ్చిన ఈ ఆటుపోట్లను పూజా ఒత్తిడిగా మార్చుకోకుండా, కొత్త ప్రాజెక్ట్‌ల కోసం ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మాత్రం పూజా హాట్ టాపిక్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పూజా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ, ట్రెడిషనల్ లుక్స్ తో పాటు, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో స్టన్నింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ లో చిరిగినట్లు ఉన్న ఒక చొక్కాతో పోజులు ఇచ్చింది. డిఫరెంట్ గా ఉన్న ఆ ఫోటోలు షేర్ చేయగా, అభిమానులు ఆమె లుక్‌పై మంత్ర ముగ్దులైపోయారు. వయ్యారంగా నిలబడడంతో ఆమె అందాన్ని మరింత పెంచేసింది. పూజా హెగ్డేని ఈ ఈ స్టైలిష్ లుక్ లో చూసి, నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే చివరగా తెలుగులో అయితే ఆచార్య సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి F3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఒక సినిమా చేస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే బాలీవుడ్లో షాహిద్ కపూర్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. మరి ఈ రెండు సినిమాలు అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.