నా వయసు 39..నేను చాలా హాట్!
ప్రియమణి సెకెండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Sep 2023 3:30 PM GMTప్రియమణి సెకెండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సౌత్ లో అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే `జవాన్` తో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. షారుక్ -అట్లీ తో ఉన్న పరిచయం `జవాన్` లో గొప్ప అవకాశాన్ని తెచ్చి పెట్టింది. ఇలాంటి స్టార్స్ చిత్రాల్లో ప్రియమణి చిన్న రోల్స్ లో మెప్పించడం సినిమాకి కలిసొచ్చే అంశమే. ఒకప్పటి హీరోయిన్ అనే ఇమేజ్ ఇలాంటి సపోర్టింగ్ పాత్రలకి ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ తీసుకొస్తుంది.
ఆ రకంగా `జవాన్` లో బాగానే సక్సెస్ అయింది. ఇక తెలుగు స్టార్ హీరోల చిత్రాల్లోనూ ఆ తరహా పాత్రలకు ప్రియమణి ఓ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఎవరికోసమే పరుగులు తీయడం కన్నా! ప్రియమణి లాంటి నటిని సద్వినియోగం చేసుకోగల్గితే దర్శకు నిర్మాతలకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఆ సంగతి పక్కనబెడితే ఇక అమ్మడిపై నెట్టింట జరిగే ట్రోలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ట్రోలింగ్ లు..విమర్శలకు ప్రియమణికి కొత్తేం కాదు.
ఇలాంటి వాటిని అమ్మడు పెద్దగా పట్టించుకోదు. సోషల్ మీడియాలో ఎలాంటి రిప్లైలు కూడా ఇవ్వదు. అయితే ఈసారి ప్రియమణి వయసుని సైతం ప్రస్తావిస్తూ ఆంటీ అని కొన్ని కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. గతంలోనే ఇలా తెరపైకి వచ్చాయి. అయితే అప్పుడు పట్టించుకోని అమ్మడు ఈసారి మాత్రం వాటికి రిప్లై ఇచ్చింది. ఇలాంటి కామెంట్లను తాను లైట్ గా తీసుకుంటానని చెపుతూనే సదరు నెటిజన్ పై మండిపడింది.
తనను ఆంటీ అని పిలవడాన్ని తాను పట్టించుకోనని.. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. వయసు పెరగడం అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని..ప్రస్తుతం తన వయసు 38 ఏళ్లని... అయినా ఇప్పటికీ హాట్ గానే ఉన్నానని ధీటైన సమాధానం ఇచ్చింది. మరి ఇంత కాలం సైలెంట్ గా ఉన్న అమ్మడు ఒక్కసారిగా ఇలా వైలెంట్ గా ఎందుకు మారినట్లో?