Begin typing your search above and press return to search.

హుషారు పాప.. మైండ్ బ్లోయింగ్ గ్లామర్

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయి, తనను తాను మంచి స్టార్ హీరోయిన్ గా చూసుకోవాలనే కలలు కంటుంది

By:  Tupaki Desk   |   21 Aug 2023 8:47 AM GMT
హుషారు పాప.. మైండ్ బ్లోయింగ్ గ్లామర్
X

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయి, తనను తాను మంచి స్టార్ హీరోయిన్ గా చూసుకోవాలనే కలలు కంటుంది. కానీ, ఈ అదృష్టం అందరికీ లభించదు. అలా అదృష్టం లభించక, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది హాట్ బ్యూటీ ప్రియా వడ్లమాని. ఈ తెలుగు అమ్మాయి ఇప్పటి వరకు నాలుగైదు సినిమాలు చేసింది. వాటిలో హుషారు మూవీ బాగా క్లిక్ అయ్యింది. ఆ సినిమాతోనే అందరి కళ్లు ప్రియ మీద పడ్డాయి.


చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గ్లామర్ రోల్స్ చేయడంలోనూ ఏ మాత్రం మొహమాట పడదు. అయినా, పాపం సినిమా అవకాశాలు మాత్రం కరువయ్యాయి. మధ్య మధ్యలో అరకొరగా, చిన్న సినిమాల్లో రోల్స్ అందుకుంటోంది. ఈ మధ్యకాలంలో ముఖ చిత్రం అనే సినిమా చేసింది. సినిమాలో రెండు వేరియేషన్స్ లో ఆకట్టుకుంది.


కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలతో మాయ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. బ్లాక్ కలర్ బ్రా లో, పైన వైట్ కలర్ షర్ట్ ధరించింది. ఇక, ఆ డ్రెస్ లో ఆమె ఫోజులు చూడటానికి రెండు కళ్లు సరిపోవు అనిపించేలా ఉంది.


ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ప్రియ అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి అందానికి ఆఫర్లు ఎందుకు ఇవ్వడం లేదో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రియ 2019లో ఆవిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2018 లో వచ్చిన హుషారు సినిమాలో రియా పాత్రలో నటించి అందరి గుర్తింపు సంపాదించింది.

ఆ తర్వాత శుభలేఖలు సినిమాలో నటించగా ఈ సినిమా కూడా తనకు బాగానే పేరు తెచ్చింది. అన్ని సినిమాల్లోకెల్లా ముఖచిత్రంలో ఆమె నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఒక్క మంచి అవకాశం వస్తే, తనను తాను నిరూపించుకోగలదు. మరి ఈ బ్యూటీ కి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.