Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : టైట్ అందాలతో కవ్విస్తున్న రాయ్‌

తెలుగు ప్రేక్షకులకు 2005 లో కాంచన మాల కేబుల్ టీవీ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్

By:  Tupaki Desk   |   29 Sep 2023 9:09 AM GMT
పిక్ టాక్ : టైట్ అందాలతో కవ్విస్తున్న రాయ్‌
X

తెలుగు ప్రేక్షకులకు 2005 లో కాంచన మాల కేబుల్ టీవీ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్. ఆ తర్వాత కొన్నాళ్లకు తన పేరును రాయ్ లక్ష్మి గా మార్చుకుని ఇండస్ట్రీలో తన అదృష్టం ను పరీక్షించుకుంది. స్టార్‌ హీరోలతో సినిమాలు లేవు.. భారీ బ్లాక్ బస్టర్ విజయాలు పెద్దగా లేవు. అయినా కూడా దాదాపు రెండు దశాబ్దాలుగా కెరీర్‌ ను కొనసాగిస్తోంది.


ఇన్నాళ్ల ఈ అమ్మడి కెరీర్‌ జోరుకు కారణం అందాల ఆరబోత అనడంలో సందేహం లేదు. చేసిన ప్రతి సినిమా లో కూడా కెరీర్ ఆరంభం నుంచి కూడా అందాల ఆరబోత చేయడం విధిగా పెట్టుకున్నట్లుగా స్కిన్‌ షో చేసింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మి జోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆమె షేర్‌ చేసే ప్రతి ఫోటో షూట్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది. హీరోయిన్‌ గానే కాకుండా ఫోటో షూట్స్ తో ఈ అమ్మడు దక్కించుకున్న గుర్తింపు, పాపులారిటీ ఏకంగా బాలీవుడ్ ఆఫర్లను తెచ్చి పెట్టాయి అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్ లు దక్కలేదు.

తాజాగా మరోసారి తన బిగుతు అందాల ఆరబోత ఫోటో షూట్ ను షేర్‌ చేసింది. ఎద అందాలను ఎక్స్‌ పోజ్ చేస్తూ బ్లాక్ డ్రెస్ లో రాయ్ లక్ష్మి షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెటిజన్స్ ని చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయడం వల్లే నాలుగు పదుల వయసుకు వచ్చినా కూడా సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ముందు ముందు కూడా రాయ్ లక్ష్మికి మంచి ఆఫర్లు దక్కడం ఖాయం.