Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్లీవేజ్ కవ్వింపులు.. రాశి మెరుపులు

ఊహలు గుసగుసలాడే సినిమా తో అలరించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా తన అందం సినిమా సినిమా కు పెంచుకుంటూనే వస్తుంది

By:  Tupaki Desk   |   21 Aug 2023 2:49 PM GMT
పిక్ టాక్ : క్లీవేజ్ కవ్వింపులు.. రాశి మెరుపులు
X

ఊహలు గుసగుసలాడే సినిమా తో అలరించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా తన అందం సినిమా సినిమా కు పెంచుకుంటూనే వస్తుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు బొద్దు గుమ్మల కంటే ముద్దుగుమ్మలు నప్పుతారని తెలిసి కష్టపడి బరువు తగ్గింది. అంతే కాకుండా చాలా వరకు విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగిన విషయం తెల్సిందే.


హీరోయిన్ గా రాశి ఖన్నా తెలుగు మరియు తమిళంలో ఇన్ని సినిమాలు చేయడానికి కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో ఆమె అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ ఇంకా హీరోలు కూడా ఆమెను తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపించారు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

తాజాగా గ్లోబల్ స్పా మ్యాగజైన్ కవర్‌ పై రాశి ఖన్నా సర్ ప్రైజ్ లుక్స్ తో ఆకట్టుకుంది. కవ్వించే క్లీ వేజ్ షో చేయడం తో పాటు విభిన్నమైన ఔట్ ఫిట్ లో కనిపించింది. హీరోయిన్ గా రాశి ఖన్నా కు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉందని ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అనిపిస్తుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. కానీ రెండు మూడు పెద్ద సినిమాల చర్చలు జరుగుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తూ ఉంటే ముందు ముందు మరి కొన్నాళ్ల పాటు కూడా ఇండస్ట్రీలో ఈ అమ్మడి జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.