గోడపైన అద్దంలా రకుల్
అవును.. రకుల్ ని చూడగానే అద్దంలాగే కనిపిస్తోంది. తళతళా మెరిసే బాత్రూమ్ గోడలపై ఒక మిర్రర్ ఇమేజ్ లా మారింది రకుల్
By: Tupaki Desk | 18 Aug 2024 11:30 PMఅవును.. రకుల్ ని చూడగానే అద్దంలాగే కనిపిస్తోంది. తళతళా మెరిసే బాత్రూమ్ గోడలపై ఒక మిర్రర్ ఇమేజ్ లా మారింది రకుల్. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్ కోసం రకుల్ ఎంపిక చేసుకున్న పసుపు రంగు ఫ్రాక్ (బాడీ కాన్) లో రకుల్ అందచందాలు మతులు చెడగొడుతున్నాయి. రకుల్ ప్రీత్ ఇన్నర్ సొగసును ప్రత్యేకంగా హైలైట్ చేసింది ఈ ఫోటోషూట్.
రకుల్ ఎంపిక చేసుకున్న ఈ డిజైనర్ ఫ్రాక్‌కి చాలా ప్రత్యేకత కనిపిస్తోంది. పాక్షికంగా రకుల్ ఇన్నర్ అందాలను ఇది ఎలివేట్ చేస్తోంది. రకుల్ ఎంపిక చేసుకున్న ఫ్రాక్ కి అనుగుణంగా నేపథ్యంలో గోడల షైనింగ్ కూడా ఎంతో ఆకర్షణీయంగా మెర్జ్ అయింది. దీనికి మిర్రర్ మిర్రర్ ఆన్ ది వాల్! అన్న ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది రకుల్. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
అన్నిచోట్లా పనిచేయడం అదృష్టం:
దక్షిణాదిన కెరటం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రాలతో నటిగా కెరీర్ ప్రారంభించిన రకుల్ 2014లో `యారియాన్` చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కూడా సౌత్‌లో నటిస్తూనే హిందీలో పలు క్రేజీ చిత్రాల్లో నటించింది.
కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూస్తే.. సంవత్సరాలుగా అన్ని చలనచిత్ర పరిశ్రమలలో పని చేయగలగడం ఆశీర్వాదమని రకుల్ అంది. అదృష్టం అనేది సరైన పదమో కాదో నాకు తెలియదు కానీ.. నేను పరిశ్రమ నుండి వచ్చిన వ్యక్తిని కానప్పటికీ విభిన్న పని సంస్కృతులను అనుభవించే అవకాశం కలిగింది. ఇక్కడ ఉత్తమమైన వారితో పనిచేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞురాలిని. తెలుగు, తమిళం, హిందీ చలనచిత్ర సోదరులు ఉత్తమమైన వారు అని కూడా రకుల్ ప్రశంసించింది.
`నేను దేవుని బిడ్డను` అని ఎప్పుడూ చెబుతాను! అని కూడా రకుల్ వ్యాఖ్యానించింది. అతడు నా కోసం ఒక చోటును సృష్టిస్తాడు. విభిన్న పరిశ్రమలలో పని చేయడానికి.. విభిన్న వ్యక్తుల నుండి నేర్చుకునే అవకాశాన్ని పొందడ జీవితానికి సుసంపన్నమైన అనుభవం. మీరు దీన్ని ఎప్పటికీ ప్లాన్ చేయలేరు లేదా అమలు చేయలేరు. ఇది విధి మీ కోసం రూపొందించినది. నాకు ఆ అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రకుల్ ఆనందం వ్యక్తం చేసింది.