Begin typing your search above and press return to search.

రష్మీ ​.. 37ఏళ్ల వయసులోనూ హీటెక్కించే గ్లామర్

ఇక ఆమె నేచురల్ బ్యూటీకీ కాస్త లైట్ మేకప్ టచ్ ఇచ్చి నైస్​ హైయిర్ స్టైల్​లో అద్భుతంగా మెరిసింది. ఆమె అప్పియరెన్స్​ ఎంతో కూల్​గా మెస్మరైజ్​ చేసింది

By:  Tupaki Desk   |   29 Sep 2023 7:15 AM GMT
రష్మీ ​.. 37ఏళ్ల వయసులోనూ హీటెక్కించే గ్లామర్
X

బాలీవుడ్ భామ రష్మీ దేశాయ్.. సోషల్ మీడియా, స్మాల్​ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్​ను బాగా పరిచయమైన భామే. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్​లతో పాటు సినిమాలో చేస్తూ బీ టౌన్​లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అయితే ఫుల్ యాక్టీవ్​గా ఉండే ఈ 37ఏళ్ల అందాల ముద్దుగుమ్మ.. స్కిన్ షో ఫొటోషూట్స్​ పోస్ట్ చేస్తూ.. నెట్టింట రచ్చ చేస్తుంటుంది.


తన యూనిక్​ స్టైల్​, ఫ్యాషన్ సెన్స్​తో నెటిజన్లలో ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ​.. తాజాగా తన ఫ్యాన్స్​కు కొత్త స్టన్నింగ్ ఫొటోషూట్​తో మరో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. గ్రీన్ కలర్ ప్యాంట్​, ఎల్లో కలర్ టాప్​ కలిగి ఉన్న ఓ మోడ్రన్ ఔట్​ ఫిట్​లో మెరిసింది. ఆమె ధరించిన నెక్లెస్​, బ్రాస్​లెట్​, చెయిన్ అన్నీ హైలైట్​గా ఉన్నాయి.

ఇక ఆమె నేచురల్ బ్యూటీకీ కాస్త లైట్ మేకప్ టచ్ ఇచ్చి నైస్​ హైయిర్ స్టైల్​లో అద్భుతంగా మెరిసింది. ఆమె అప్పియరెన్స్​ ఎంతో కూల్​గా మెస్మరైజ్​ చేసింది. అయితే ఈ కూల్ ఫొటోషూట్​కు కాస్త హాట్ టచ్ ఇస్తూ ఓపెన్ టాప్ యాంగిల్​ షో కూడా చేసింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈ ఫొటోషూట్ చేసింది. ఇక ఇవి చూసిన అభిమానులు ఈ పిక్స్​ను షేర్​ చేసుకుంటూ రష్మీ దేశాయ్​ ఎంత అందంగా ఉందో, చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, రష్మి దేశాయ్​.. 2006లో బుల్లితెరపై రావన్ సీరియల్​తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు హిట్​ సీరియల్స్​లో నటించింది. రెండు ఇండియన్ టెలివిజన్​ అకాడమీ అవార్డ్స్​, గోల్డెన్స్ అవార్డ్​ను అందుకుంది. ఉత్తరన్​, దిల్​ సే దిల్​ తక్​, బిగ్​ బాస్​ 13, 15 సీజన్లతో మంచి క్రేజ్​ తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లోనూ నటించింది.

ప్రస్తుతం మిషన్ లైలా, మామ్ తానే నా సమ్జే, చాంబి ది బూటి అనే హిందీ, గుజరాతీ, పంజాబీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. రీసెంట్​గా ఈ ఏడాది 'ప్యార్​ ఏదా దా' అనే మ్యూజిక్ ఆల్బమ్​లోనూ మెరిసింది.