Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్స్.. డబుల్ ట్రీట్!

గతంలో స్టార్ హీరోలు ఏడాదికి 6 నుంచి 8 సినిమాల వరకు చేసేవారు. సినిమాలకి కాల్ షీట్స్ ని కూడా బ్యాక్ టూ బ్యాక్ కేటాయిస్తూ ఉండేవారు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:10 AM GMT
స్టార్ హీరోయిన్స్.. డబుల్ ట్రీట్!
X

గతంలో స్టార్ హీరోలు ఏడాదికి 6 నుంచి 8 సినిమాల వరకు చేసేవారు. సినిమాలకి కాల్ షీట్స్ ని కూడా బ్యాక్ టూ బ్యాక్ కేటాయిస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాలలో స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో చాలా సార్లు ఇలా జరిగింది. చిరంజీవికి కూడా ఒకటి రెండు సార్లు ఎలాంటి అనుభవం ఎదురైంది.

రీసెంట్ గా అక్షయ్ కుమార్ హిందీలో నటించిన ఖేల్ ఖేల్ మే, గెస్ట్ రోల్ చేసిన స్త్రీ2 సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఇలా సినిమాల మధ్య డేట్స్ క్లాస్ కావడం జరగదు. అయితే హీరోయిన్స్ మాత్రం ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ మూవీ కోసం ఇచ్చే డేట్స్ తక్కువగా ఉంటాయి. అందుకే అవకాశం ఉన్నప్పుడే ఏడాదికి 5,6 సినిమాలు కూడా హీరోయిన్స్ చేస్తున్నారు.

ఇలా చేయడం వలన హీరోయిన్స్ చేసిన రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చాందిని చౌదరి లీడ్ రోల్ లో చేసిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కి అలాంటి అనుభవమే ఎదురవుతోంది. తెలుగు, తమిళ్ భాషలలో లీడింగ్ యాక్టర్ గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి దుల్కర్ సల్మాన్ కి జోడీగా లక్కీ భాస్కర్ సినిమాలో నటించింది.

అలాగే విశ్వక్ సేన్ కి జోడీగా మెకానిక్ రాకీ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు అక్టోబర్ 31న ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్నాయి. దీంతో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ తో పాటు మెకానిక్ రాకీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా ఈ రెండు సినిమాలు ఆమెకి చాలా కీలకం కావడం విశేషం. నిజానికి లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న రిలీజ్ కావాల్సింది. అయితే డేట్ వాయిదా పడి సెప్టెంబర్ 27కి వెళ్ళింది. ఇప్పుడు అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ మధ్య పోటీ తప్పలేదు.

అలాగే పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న రష్మిక మందనకి పుష్ప ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై రష్మిక చాలా హోప్స్ పెట్టుకుంది. అదే డేట్ కి హిందీలో ఆమె విక్కీ కౌశల్ కి జోడీగా నటించిన చావా మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఛత్రపతి శివాజీ కథతో ఈ చావా మూవీ తెరకెక్కింది. ఈ సినిమాపైన ఆమెకి చాలా నమ్మకం ఉంది. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలతో రష్మిక మందన థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో కూడా రష్మిక కచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది.