ట్రెండీ స్టోరి: చుక్కలు చూపిస్తున్న చక్కనమ్మలు
క్రేజ్ ని బట్టి రేంజు! అందం, అభినయం వీటికి తోడు జనంలో క్రేజ్ కి అనుగుణంగా స్టార్ల పారితోషికం మారిపోతుంది
By: Tupaki Desk | 15 March 2024 4:00 AM GMTక్రేజ్ ని బట్టి రేంజు! అందం, అభినయం వీటికి తోడు జనంలో క్రేజ్ కి అనుగుణంగా స్టార్ల పారితోషికం మారిపోతుంది. ఇటీవలే `యానిమల్`లో నటించిన ట్రిప్తి దిమ్రీ ఇప్పుడు అమాంతం కోటి పారితోషికం అందుకుంటోందని కథనాలొస్తున్నాయి. ఏడాది కిందట ట్రిప్తి ఎవరో ఎవరికీ తెలీదు.
నిజానికి ఇలా ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకునే భామలు చిరకాలం ఇదే ఎదుగుదలను కనబరుస్తారా? అన్నది చెప్పలేం. కానీ తమదైన ఛరిష్మా, నట ప్రతిభ, లక్ వంటి అంశాలతో దశాబ్ధాల పాటు పరిశ్రమను ఏలిన కథానాయికల పారితోషికాల రేంజ్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.
భారతదేశంలో పారితోషికంలో టాప్ 10 కథానాయికల గురించి పరిశీలిస్తే.. బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనే నంబర్ 1 స్థానంలో ఉంది. తనకు ఉన్న అసాధారణ క్రేజ్ దృష్ట్యా దాదాపు రూ. 15 నుండి 30 కోట్ల మేర ప్యాకేజీ అందుకుంటోంది.యువతరంలో ఎంతో క్రేజ్ ఉన్న దీపిక పదుకొనే కల్కి చిత్రంతో టాలీవుడ్ లోను అడుగుపెడుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 20కోట్ల పారితోషికం అందుకుంటోందని కథనాలొస్తున్నాయి. ద్వితీయ స్థానంలో కంగన, తృతీయ స్థానంలో ప్రియాంక చోప్రా ఉన్నారు.
కంగన నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. ఇటీవల జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న క్వీన్ వరుసగా నాయికా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. కంగన ఒక్కో సినిమాకి రూ. 15 - 27 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్టార్ గా వెలిగిపోతోంది. ఒక్కో సినిమాకి సుమారు రూ. 14 నుండి 23 కోట్లు వరకూ అందుకుంటోందని సమాచారం. 39 వయసులోను టీనేజీ హొయలుతో కట్టి పడేస్తున్న కత్రినా కైఫ్ రెండు దశాబ్ధాల కెరీర్ లో అసాధారణ స్థాయికి చేరుకుంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 నుండి 21 కోట్లు అందుకుంటోంది.
భారతదేశంలోనే అత్యద్భుతమైన నటిగా పాపులరైన యంగ్ బ్యూటీగా ఆలియా భట్ ఒక్కో సినిమాకి రూ. 10 నుండి 20 కోట్లు అందుకుంటోందని తెలుస్తోంది. 42 ఏళ్ల కరీనా కపూర్ ఖాన్ ఇద్దరు కిడ్స్ కి జన్మనిచ్చాకా ఇంకా భారీ పారితోషికాలు అందుకుంటోంది. కథానాయికగా ఒక్కో సినిమాకి సుమారు రూ. 8 కోట్ల నుండి 18 కోట్లు డిమాండ్ చేస్తోంది. సీనియర్ నటీమణుల్లో విద్యా బాలన్ ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుండి 14 కోట్ల పారితోషికం అందుకుంటోంది. యువనాయికలు జాన్వీ కపూర్- అనన్య పాండే- సారా అలీఖాన్ సైతం సుమారు 3 కోట్లు పైగా అందుకుంటున్నారు. సౌత్ కథానాయికల్లో నయనతార 6-8 కోట్లు, కాజల్- సమంత లాంటి 3- 4 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటున్నారు. తమన్నా 3కోట్ల రేంజులో అందుకుంటోంది.
ఒక్కో సినిమాకి కథానాయికల పారితోషికం రేంజ్:
1. దీపికా పదుకొణె ఒక్కో సినిమాకు 15cr నుండి 30cr
2. కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు 15cr నుండి 27cr
3. ప్రియాంక చోప్రా జోనాస్ ఒక్కో సినిమాకు 15cr నుండి 25cr
4. కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 15cr నుండి 25cr
5. అలియా భట్ ఒక్కో సినిమాకి 10cr నుండి 20cr
6. కరీనా కపూర్ ఖాన్ ఒక్కో సినిమాకు 8cr నుండి 18cr
7. శ్రద్ధా కపూర్ ఒక్కో సినిమాకు 7cr నుండి 15cr
8. విద్యాబాలన్ ఒక్కో సినిమాకు 8cr నుండి 14cr
9. అనుష్క శర్మ ఒక్కో సినిమాకు 8cr నుండి 12cr
10. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒక్కో సినిమాకు 10కోట్లు
11. కృతి సనన్ ఒక్కో సినిమాకు 5cr నుండి 11cr
12. తాప్సీ పన్ను ఒక్కో సినిమాకు 5cr నుండి 11cr
13. ఒక్కో సినిమాకు రాణి ముఖర్జీ 8cr
14. సోనమ్ కపూర్ ఒక్కో సినిమాకు 8cr
15. జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు 4cr నుండి 10cr