రేణు దేశాయ్ గుండె సమస్య..జెన్యుపరమైనది!
'నా గుండె తీరు సరిగ్గా లేదు. నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీటా బ్లాకర్లను తీసుకోవడం కొనసాగించాలి
By: Tupaki Desk | 14 Oct 2023 8:08 AM GMTనటి రేణు దేశాయ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలు ఉన్నా.. వాటి నుంచి తాను బయట పడగలనన్న విశ్వాసాన్ని రేణు వ్యక్తం చేసారు. 'నవ్వుతూ ఉండండి. హాయిగా ఉండండి. చికిత్స,.. మెడికేషన్.. యోగా.. న్యూట్రిషన్ లాంటివన్నీ కొనసాగుతున్నాయి. త్వరలోనే సాధారణ జీవితాన్ని గడుపుతూ మళ్లీ షూటింగ్ లలో పాల్గొంటానని భావిస్తున్నాను' అని రేణు ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసారు.
దీంతో అభిమానుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెకి గుండె సమస్యలు ఏంటని ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు? అన్నది అప్పుడు రివీల్ చేయలేదు. తాజాగా ఆమె 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ప్రమెషన్ లో భాగంగా అనారోగ్యానికి సంబంధించి మరిన్ని విషయాలు రివీల్ చేసారు.
'నా గుండె తీరు సరిగ్గా లేదు. నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీటా బ్లాకర్లను తీసుకోవడం కొనసాగించాలి. ఇది కొంత కోమాటోస్ స్థితిని ప్రేరేపిస్తుంది. తత్ఫలితంగా నేను గణనీయమైన బరువును పెరిగాను. గత 3-4 నెలలుగా డైట్ లోనే ఉన్నాను. స్టెరాయిడ్స్ వాడాను. ఆ కారణంగా ఎక్కువ బరువు పెరిగాను. అలాగే సహజమైన ఆయుర్వేద చికిత్సలను కూడా తీసుకుంటున్నాను. ఇది సవాల్ తో కూడుకున్న ప్రయాణం.
నాకొచ్చింది జన్యుపరమైన సమస్య. దీనిని ‘మయోకార్డియల్ బ్రిజింగ్’ అంటారు. ఈ సమస్య వల్ల ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకోవడం.. ఆయాసంగా అనిపించడం.. చెమటలు పట్టడం.. హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపిస్తుంది. దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటూ మందులు వాడుతున్నాను. నాతండ్రి వైపు నుంచి ఈ సమస్య వచ్చింది. మా నాన్న...నాయనమ్మ ఇద్దరూ గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు. 47 మరియు 50 సంవత్సరాల వయస్సులో కుప్పకూలారు. అది నాకెంతో షాక్. దురదృష్టవశాత్తు అదే సమస్య నాకు వచ్చింది. అందుకే సినిమాల విషయంలో ...చేసే పాత్రల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేయాలి ' అని అన్నారు.