ఆ హీరోయిన్ శరీరంలో గాజు ముక్కలు!
ప్రస్తుతానికి నొప్పి లేదు. అయినా కొన్ని గాజు ముక్కలు లోతుగా దిగాయి. అందుకే ఆసుపత్రికి వెళ్లాను
By: Tupaki Desk | 5 Dec 2023 5:30 PM GMTరితికా సింగ్ ఓ సినిమా షూట్ లో గాయాలపాలైంది. ప్రమాదవశాత్తు చేతిలో ఉన్న అద్దం పగలడంతో శరీరంలో కి గాజుపెంకులు దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్ స్టా ద్వారా తెలియ జేసింది. 'గాజు అద్దముంది. జాగ్రత్తగా ఉండమని సెట్ లో అందరూ చెబుతూనే ఉన్నారు. కానీ ఆ సమయంలో అదుపు తప్పి దాన్ని సరిగ్గా పట్టుకోలేకపోయాను. దాంతో ఇలా జరిగింది.
ప్రస్తుతానికి నొప్పి లేదు. అయినా కొన్ని గాజు ముక్కలు లోతుగా దిగాయి. అందుకే ఆసుపత్రికి వెళ్లాను. పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటాను' అని తెలిపింది. ప్రస్తుతం రితికాసింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టి. జి జ్ఞాన్ వేల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ లోనే ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రితికా సింగ్ కొన్నాళ్ల పాటు షూటింగ్ కి హాజరయ్యే అవకాశం లేదు.
రితికా సింగ్ టాలీవుడ్ కి సుపరిచితమే. 'గురు'..'నీవెవరో' లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజ్ అయిన 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమాలోనూ నటించింది. రితికా సింగ్ మిక్స్ డు మార్సల్ ఆర్స్ట్ లో శిక్షణ తీసుకుంది. చిన్న వయసు నుంచే మార్షల్ ఆర్స్ట్ లో తర్పీదు పొందింది. ఈనేపథ్యంలో 'గురు' సినిమా లో బాక్సర్ పాత్రలో నటించే అవకాశం అందుకోగల్గింది. ప్రస్తుతం తలైవార్ 170వ సినిమా మినహా కొత్త ఛాన్సులేవి చేతిలో లేవు. తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది గానీ...రావడం లేదు.
నిత్యం సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లని ఆకర్షిస్తుంది. అలాగే యువతకి..మహిళలకి సెల్ప్ డిపెన్స్ కోసం మార్షల్ ఆర్స్ట్ ..కుంగూ ఫూ..కరాటాలే లాంటివి కూడా తప్పక నేర్చుకోవాలని సూచిస్తుంటుంది. బాల్యం నుంచి మహిళలు వీటి పట్ల ఆకర్షితులయ్యేలా చేయాలని చెబుతుంటుంది.