Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కిల్ల‌ర్ బ్యూటీ థై సొగ‌సులు ప‌రేషాన్

టాప్ మోడ‌ల్ కం బాలీవుడ్ న‌టి రుహీ సింగ్ ఇంట్రో అవ‌స‌రం లేదు. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఇటీవ‌ల ప‌రిచ‌య‌మైంది

By:  Tupaki Desk   |   30 Nov 2023 3:15 AM GMT
ఫోటో స్టోరి: కిల్ల‌ర్ బ్యూటీ థై సొగ‌సులు ప‌రేషాన్
X

టాప్ మోడ‌ల్ కం బాలీవుడ్ న‌టి రుహీ సింగ్ ఇంట్రో అవ‌స‌రం లేదు. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఇటీవ‌ల ప‌రిచ‌య‌మైంది. ఈ భామ సినిమాల‌తో కంటే ఇటీవ‌ల సోష‌ల్ మీడియా పోస్టింగుల‌తోనే ఎక్కువ‌గా వేడి పెంచుతోంది. నిరంత‌రం వేడెక్కించే హాట్ ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది.


రుహి తాజా ఫోటోషూట్ ని అభిమానుల కోసం ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో రుహీ ఒక న‌దిలో బోట్ షికార్ చేస్తూ క‌నిపించింది. రెడ్ టాప్ ధ‌రించిన ఈ బ్యూటీ బాట‌మ్ లెస్ లుక్ లో క‌నిపించింది. ఈ కొత్త గెట‌ప్ లో టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యాన్ని రూహీ ప్ర‌ద‌ర్శించింది. రూహీ రెడ్ టాప్ పై వైట్ ష‌ర్ట్ ని ధ‌రించి, బ్లాక్ గాగుల్స్ తో స్టైలిష్ గా క‌నిపించింది. లేటెస్ట్ భంగిమ .. వేడెక్కించే డ్రెస్సింగ్ సెన్స్ బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

బీచ్ బికినీ సెల‌బ్రేష‌న్స్ లో చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌తో వేడెక్కించ‌డంలో రూహీకి చాలా పెద్ద రికార్డ్ ఉంది. ఇప్పుడు ఇలా ర‌న్నింగ్ బోట్ పై షికార్ చేస్తూ ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో చెల‌రేగిన ఈ బ్యూటీ మ‌రోసారి యూత్ హార్ట్ ని ట‌చ్ చేసింది. పాపాతో క‌లిసి దేశాలు తిరుగుతున్నా! అంటూ రూహీ వెల్ల‌డించింది. ఇక ఇదే ఫోటోషూట్ లో త‌న తండ్రి గారి ఫోటోగ్రాఫ్ ని కూడా షేర్ చేసింది. ఇక బోట్ షికార్ లో రూహీ అందం ప‌రేషాన్ .. సంథింగ్ స్పెష‌ల్! అంటూ ఫ్యాన్స్ ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు. ఈ భామ హిందీ చిత్రసీమ‌తో పాటు సౌత్ లో పెద్ద రేంజు కెరీర్ ని ఆశిస్తోంది. కానీ ఆశించిన అవ‌కాశాలేవీ త‌న‌వైపు రాలేదు. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాల్లో ఇలా కాల‌క్షేపం చేస్తోంది. రూహీ చివ‌రిగా చ‌క్ర‌వ్యూహ్ అనే వెబ్ సిరీస్ లో న‌టించ‌గా ఇందులో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.