Begin typing your search above and press return to search.

స్టన్నింగ్ సామ్​.. సిట్టింగ్​ పోజులో పైటను పక్కకు జరిపి

స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రెస్ట్ మోడల్​ ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వెకేషన్​ ట్రిప్​లు అంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ భామ.

By:  Tupaki Desk   |   2 Nov 2023 9:25 AM GMT
స్టన్నింగ్ సామ్​.. సిట్టింగ్​ పోజులో పైటను పక్కకు జరిపి
X

స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రెస్ట్ మోడల్​ ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వెకేషన్​ ట్రిప్​లు అంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ భామ.. సోషల్ మీడియాలోనూ వాటిని షేర్​ చేస్తూ ఫ్యాన్స్​కు టచ్​లోనే ఉంది. మధ్య మధ్యలో ఫొటోషూట్స్ కూడా చేస్తూ అభిమానులను అలరించింది. తాజాగా మరోసారి పైట పక్కకు జరిపి పింక్ కలర్ శారీలో సిట్టింగ్ పోజు ఇచ్చి ఆకట్టుకుంది.


వివరాళ్లోకి వెళితే.. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో దాదాపు పదిహేనేళ్లుగా టాలీవుడ్​ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా హవాను కొనసాగిస్తూ దూసుకుపోతోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. గతంలో కన్నా ఆ మధ్య పుష్పతో తన స్టార్​ డమ్​ను మరింతగా పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

అయితే రీసెంట్​గా మయోసైటిక్​ ట్రీట్​మెంట్​ సహా కాస్త ప్రశాంతంగా ఉండేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినా సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ విషయాలతో పాటు హాట్ ఫొటోషూట్స్​ను పోస్ట్​ చేస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

అయితే ఈ మూడు నాలుగు రోజుల నుంచి వరుసగా చీరలో అందాలను ఆరబోస్తూ రోజుకో ఫొటోను పోస్ట్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్​ శారీలో అదిరిపోయే పిక్​ను షేర్ చేసింది. బ్యాక్​ గ్రౌండ్ కలర్ కూడా మ్యాచింగ్ అయ్యేలా పింక్​ వరల్డ్​లో కనువిందు చేసింది. సిట్టింగ్​ పోజులో పైటను పక్కకు జరిపి ఎద అందాలను ఎక్స్​పోజ్​ చేసింది. కాస్త స్మైలింగ్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోకు ఓ వేదాంతం కూడా రాసుకొచ్చింది.

"సుతిమెత్తనైన ఈ చక్కటి ఎంబ్రాయడరీ కలిగి ఉన్న పింక్ కలర్​​ చీర.. మీరు కలలు కనే ధైర్యాన్ని, దాన్ని సాకారం చేసుకునే అవకాశమున్న మాయాలోకానికి మార్గం చూపుతోంది. ఆకర్షితమైన ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండంది. ఎందుకంటే ఈ చక్కటి కలల ప్రపంచంలో నక్షత్రాల వెలుతురు నడుమ మీ హృదయం ఆకాశంలో తేలిపోతుంది" అని రాసుకొచ్చింది.