గ్రీక్ గాడ్ హృతిక్ ప్రియురాలి టాప్ 10 సీక్రెట్స్
అందమైన ఆ చిరునవ్వుతోనే గ్రీకువీరుడిని ప్రేమ ముగ్గులోకి దించేసింది సబా అజాద్. తన నవ్వు ప్రతిభ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 31 Oct 2023 5:05 AM GMTఅందమైన ఆ చిరునవ్వుతోనే గ్రీకువీరుడిని ప్రేమ ముగ్గులోకి దించేసింది సబా అజాద్. తన నవ్వు ప్రతిభ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. సుజానే ఖాన్ నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న హృతిక్ ఆ తర్వాత చాలా కాలానికి గాయని కం నటి సబా అజాద్ తో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఈ జంట ప్రేమాయణం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్.
ఇటీవల హృతిక్ రోషన్ -సబా ఆజాద్‌ల రొమాన్స్ రోజురోజుకూ హెడ్ లైన్స్ లో కంటెంట్ గా మారింది. లేడీ లవ్ సబాను విడిచి హృతిక్ క్షణమైనా ఉండలేడని ఇప్పటికే ప్రూవైంది. సబా గురించి మనకు తెలిసింది తక్కువ. తెలియనిది చాలా ఎక్కువ. అందుకే ఈ టాప్ 10 సంగతులు...
1.ఆజాద్ అసలు పేరు సబా సింగ్ గ్రేవాల్.
2.ఆజాద్ భారతదేశ ప్రఖ్యాత థియేటర్ ఆర్టిస్ట్. కమ్యూనిస్ట్ నాటక రచయిత సఫ్దర్ హష్మీ మేనకోడలు.
3. సబా ఢిల్లీలోని తన దివంగత మామ థియేటర్ గ్రూప్ జన నాట్య మంచ్‌తో తన నటనా వృత్తిని ప్రారంభించింది. అక్కడ ఆమె హబీబ్ తన్వీర్ .. MK రైనా వంటి వారితో కలిసి పనిచేసింది.
4.సబా ఆజాద్ ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లి పృథ్వీ థియేటర్లో మకరంద్ దేశ్‌పాండే దర్శకత్వం వహించిన ఇద్దరు వ్యక్తుల డ్రామాలో నటించారు.
5.ఆమె మొదటి చిత్రానికి ఇషాన్ నాయర్ దర్శకుడు. `గురుర్` అనే లఘు చిత్రంతో సబా నటన మొదలైంది.
6.ఆమె 2008లో అనిల్ సీనియర్ `దిల్ కబడ్డీ`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఇర్ఫాన్, రాహుల్ బోస్, సోహా అలీ ఖాన్ కూడా నటించారు.
7. సబా ఆజాద్ భారతీయ ఇండీ సంగీతంలో సుప్రసిద్ధ సంగీతకారిణి.. చక్కని గాయని. 2012లో నటుడు, సంగీతకారుడు ఇమాద్ షాతో కలిసి పాపులర్ ఎలక్ట్రానిక్ బ్యాండ్ Madboy/Mink ని ప్రారంభించింది.
8. సబా ఆజాద్ - ఇమాద్ షా ఏడేళ్ల పాటు డేటింగ్ చేసారు. 2010లో ఈ జంట బ్రేకప్ అయింది. వారు సంగీత భాగస్వాములుగా ఇప్పటికీ కలిసే పని చేస్తున్నారు.
9. సబా ఆజాద్ 2010లో తన స్వంత థియేటర్ కంపెనీ `ది స్కిన్స్`ను ప్రారంభించింది. సెప్టెంబర్ 2010లో NCPA ప్రయోగాత్మక థియేటర్లో ప్రారంభమైన తన మొదటి నాటకం `లవ్పుక్`కి సబా దర్శకత్వం వహించింది.
10. సబా ఇటీవల వెబ్ సిరీస్ `రాకెట్ బాయ్స్`లో నటించింది. అలాగే ఇటీవలి ఓ ర్యాంప్ పై సబా అజాద్ డ్యాన్సులపై నెటిజనులు తీవ్రమైన కామెంట్లు చేసారు. కానీ సబాని హృతిక్ డిపెండ్ చేసిన తీరు వారి మధ్య ప్రేమను ఆవిష్కరించింది.