స్టైలిష్ డిజైన్ లో సాగరకన్యలా!
మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి మంజ్రేకర్ జర్నీ గురించి తెలిసిందే
By: Tupaki Desk | 19 Nov 2023 2:30 PM GMTమహేష్ మంజ్రేకర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి మంజ్రేకర్ జర్నీ గురించి తెలిసిందే. తొలుత అమ్మడు మరాఠీ చిత్రంతో లాంచ్ అయింది. అటుపై 'దబాంగ్ -3' తో బాలీవుడ్ లో ప్రవేశించింది. కానీ రెండు సినిమాలు తీవ్ర నిరుత్సాన్నే మిగిల్చాయి. సరిగ్గా ఇదే సమయంలో టాలీవుడ్ లో 'గని' లో నటించే ఛాన్స్ అందుకుంది. ఈ హిట్ తోనైనా టాలీవుడ్ లో నిలదొక్కుకుందామనుకుంటే వైఫల్యం మరోసారి నిరుత్సాహన్నే మిగిల్చింది.
కానీ టాలీవుడ్ మేజర్ రూపంలో మరో ఛాన్స్ మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. అదే ఐడెంటిటీ సహా అందం..అభినయం బోయపాటి 'స్కంద'లోనూ అవకాశం కల్పించింది. కానీ 'స్కంద' ఫలితం మళ్లీ అమ్మడిని వెనక్కి లాగి పెట్టింది. ప్రస్తుతానికి తెలుగులో ఛాన్సులైతే లేవుగానీ..హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతానికి ఆశలన్నీ ఆ ప్రాజెక్ట్ లపైనే పెట్టుకుంది. బ్యాకెండ్ డాడ్ సహకారం కూడా ఉండటంతో బాలీవుడ్ కెరీర్ పైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరి అక్కడ జర్నీ ఎలా సాగుతుందన్నది చూడాలి.
ఇక సోషల్ మీడియాలోనూ సాయి మంజ్రేకర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేసి యువతని ఆకర్షిస్తుంది. ఫిట్ నెస్ ప్రీక్ అని ఇప్పటికే చాలా వీడియోలతో ప్రూవ్ చేసింది. కుర్రాళ్ల అటెన్షన్ ఎలా డ్రా చేయాలో పక్కాగా తెలిసిన బ్యూటీ. అయితే డిజైనర్ దుస్తుల్లో మాత్రం తనలో బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేయదు. అందాల ప్రదర్శనకు తాను దూరం అంటూనే హృదయాల్ని ఛిద్రం చేయడం అన్నది అమ్మడికి మాత్రమే తెలిసిన టెక్నిక్ .
తాజాగా బ్లాడ్ డిజైన్ ఔట్ ఫిట్ లో తళకులీనింది. ఇదిగో ఇక్కడిలా సాగరన కన్యని పోలిన డిజైన్ లో కెమారాకి ఫోజులిచ్చింది. నెక్ నుంచి కాలి పదం వరకూ డిజైన్ శరీరాన్ని పూర్తిగా కవర్ చేసింది. కేవలం డ్రెస్ డిజైన్ నిహైలైట్ చేయడం కోసం చేసిన షూట్ ఇది.