Begin typing your search above and press return to search.

ముక్కు..మూతి స‌ర్జరీ చేయించుకోమ‌న్నారు! స‌యామీఖేర్

ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన కొత్త‌లో చాలా మంది చాలా ర‌కాల స‌ల‌హాలు ఇచ్చారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 2:30 PM GMT
ముక్కు..మూతి స‌ర్జరీ చేయించుకోమ‌న్నారు! స‌యామీఖేర్
X

ముంబై బ్యూటీ స‌యామీ ఖేర్ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. 'రేయ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై ఐదారేళ్ల గ్యాప్ త‌ర్వాత 'వైల్డ్ డాగ్'..'హైవే'లాంటి చిత్రాల్లో న‌టించింది. తొలి సినిమా ఫ‌లితం త‌ర‌హాలోనే వీటి ఫ‌లితాలు అమ్మ‌డిని మ‌రోసారి నిరాశ‌ప‌రిచాయి. మ‌ధ్య‌లో కొన్ని హిందీ..మరాఠీ సినిమాలు చేసింది. కానీ ఎక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఇలా ఏ ప‌రిశ్ర‌మ‌లోనూ స‌యామీఖేర్ కెరీర్ ఆశించిన విధంగా సాగ‌లేదు.

అయినా ప్ర‌య‌త్నాలు మాత్రం విర‌మించ‌లేదు. ఓవైపు ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది. తాజాగా అమ్మ‌డు 'ఘూమ‌ర్' అనే హిందీ సినిమాలో న‌టిస్తోంది. పారా అథ్లెట్ జీవిత క‌థ ఆధారంగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా కెరీర్ ఆరంభంలో ఎదురైన అనుభ‌వాల్ని పంచుకుంది.

'ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన కొత్త‌లో చాలా మంది చాలా ర‌కాల స‌ల‌హాలు ఇచ్చారు. నీ ముక్కు బాలేదు..పెదాలు స‌రిగ్గా లేవు. రెండిటీని స‌ర్జ‌రీ చేయించుకుని రా అనేవారు. అప్పుడు నాకు 18 ఏళ్లు. ఆ వ‌య‌సులో స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం క‌రెక్ట్ కాదు. అది త‌ప్ప‌ని పించింది. ఎలా ఉన్నా యాక్స‌ప్ట్ చేయాలి అన్న‌ది నా సిద్దాంతం. ఒక‌రి కోసం మ‌రొక‌రు మార‌డం త‌ప్పుగా భావిస్తాను. వాళ్ల స‌ల‌హాలు ఏమాత్రం ప‌ట్టించుకోలేదు.

ఇలాంటివ‌న్నీ ఏదో ఒక‌రోజు స‌మూలంగా తొల‌గిపోవాల‌ని కోరుకుంటున్నా. గ‌త రోజులు కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం. కానీ ఈ మార్పు స‌రిపోదు. చాలా మార్పులు రావాలి. దానికి ముందు అవ‌గాహ‌న రావాలి. అప్పుడే మార్పు క‌నిపిస్తుంది' అని తెలిపింది. అయితే స‌యామీ వ్యాఖ్య‌ల్ని కొంద‌రు యాక్స‌ప్ట్ చేయ‌డం లేదు. సినిమా రంగంలో బ్యూటీ అనేది కీల‌కం. నిన్ను విమ‌ర్శించిన వారు ఎవ‌రూ లేరు.

కేవ‌లం స‌ర్జ‌రీలు చేసుకుంటే స‌రిపోతుంది అన్న దానికి ఇంత క్లాస్ అవ‌స‌ర‌మా? అంటూ ఓ నెటి జ‌నుడు కామెంట్ పెట్టాడు. వ‌య‌సుతో పాటు అందం..శ‌రీరంలో నూ ఎన్నో మార్పులొస్తుంటాయి. 18 ఏళ్ల వ‌య‌సు కి 22 ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత ఎవ‌రి అందంలోనైనా స‌హ‌జంగా మార్పులొస్తాయి. వాటిని అంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.