లెగ్స్ అందాలతో సాక్షి గ్లామర్ బ్లాస్ట్
మంచు మనోజ్ హీరోగా వచ్చిన పోటుగాడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సాక్షి చౌదరి
By: Tupaki Desk | 12 Aug 2024 2:30 PM GMTమంచు మనోజ్ హీరోగా వచ్చిన పోటుగాడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సాక్షి చౌదరి. ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఆ మూవీ చేసిన రెండేళ్ల తర్వాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన జేమ్స్ బాండ్ మూవీలో ఫీమేల్ లీడ్ లో సాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో మాఫియా డాన్ గా ఆమె పాత్ర ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా ఆ చిత్రంలో సాక్షి నటించింది.
దీని తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ తోనే సెల్ఫీ రాజా మూవీలో నటించింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇప్పటివరకు సాక్షి చౌదరి తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ భాషలలో కూడా మూవీస్ చేసింది. ఈ మూవీస్ లలో ఏవీ పెద్దగా సాక్షి చౌదరికి కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. చాలా సినిమాలలో ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కి పరిమితం అయ్యింది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే సాక్షి చౌదరి కెరియర్ లో ఆశించిన స్థాయిలో పొందలేదు. మెల్లగా ఆమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
చివరిగా సాక్షి చౌదరి ‘నేనెవరు’ అనే సినిమాలో తెలుగులో నటించింది. 2022 తర్వాత సాక్షి చౌదరి మరల బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సాక్షి చౌదరి ఫారిన్ స్ట్రీట్ లో దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో సాక్షి చౌదరి వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఉంది.
ఈ ఫోటోలలో స్లిమ్ లుక్ తో అదిరిపోయే అందంతో సాక్షి చౌదరి మెస్మరైజ్ చేస్తోంది. నెటిజన్లు సాక్షి చౌదరి లుక్స్ చూస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. కరెక్ట్ గా ఫోకస్ చేస్తే సాక్షి చౌదరి స్పెషల్ సాంగ్స్ కి బెస్ట్ ఛాయిస్ అవుతుందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఓటీటీలలో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి. మోడ్రన్ టచ్ ఉన్న పాత్రలకు సాక్షి చౌదరి మంచి ఆప్షన్ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి అమ్మడు ఆ రూట్లో ఏమైనా ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి.