Begin typing your search above and press return to search.

హాటీ క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని బికినీ ట్రీట్

కార్తీక్ ఆర్యన్ నటించిన 'సోను కే టిటు కి స్వీటీ'లో వేడెక్కించే హొయ‌లొల‌క‌బోసిన సాక్షిమాలిక్ ని యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు

By:  Tupaki Desk   |   4 Sep 2023 4:49 AM GMT
హాటీ క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని బికినీ ట్రీట్
X

కార్తీక్ ఆర్యన్ నటించిన 'సోను కే టిటు కి స్వీటీ'లో వేడెక్కించే హొయ‌లొల‌క‌బోసిన సాక్షిమాలిక్ ని యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అందులోని బోమ్ డిగ్గీ డిగ్గీ పాటలో సాక్షి క‌వ్వింత‌కు ఫిదా అయిపోయారంతా. అటుపై అర్మాన్ మాలిక్ 'వెహం' మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. ఇటీవ‌ల‌ ఇంటర్నెట్ సంచలనంగా సాక్షి మాలిక్ ట్రీట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నటి కం మోడ‌ల్.. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాను ఫిట్నెస్ ఫ్రీక్ గాను పాపులరైంది.


అలాగే ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో హాట్ ప్రెజెన్స్‌తోను బోలెడంత పాపుల‌రైంది. నిరంత‌ర ఫోటోషూట్లలో సాక్షి చాలా హాట్‌గా సిజ్లింగ్‌గా కనిపిస్తుంది. ఇత‌రుల‌కు హాట్‌నెస్ గోల్స్ సెట్ చేయ‌డంలో ఈ భామ ప్ర‌త్యేక‌తే వేరు. ఇప్ప‌టికే ఇంటర్నెట్‌లో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా టోన్డ్ శ‌రీరాకృతితో సాక్షి అంద‌చందాల ఎలివేష‌న్ ప్ర‌తిసారీ నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారుతోంది.

మ‌రోసారి సాక్షి హాటెస్ట్ బికినీ షూట్ అంత‌ర్జాలంలో హీట్ పెంచింది. ఈ ఆరెంజ్ బికినీ నుండి కళ్ళు తిప్ప‌డం అంత సులువు కాదు. అలా వాష్‌రూమ్ లో బికినీ సొగ‌సును ఎలివేట్ చేస్తూ సెల్ఫీ దిగుతున్న సాక్షి భంగిమ‌పై ఇప్పుడు యూత్ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

టాప్ మోడ‌ల్‌గా ప్ర‌స్థానం..

సాక్షి మాలిక్ .. టాప్ మోడ‌ల్ కం న‌టి. ప‌లు బ్రాండ్ల‌కు మోడ‌లింగ్ చేసి టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ తో ఆడియెన్ కి చేరువైంది. ఇంత‌కు ముందు మారుతి ఆటో ఎక్స్ పో-2020 వేదిక‌పై బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ర్యాంప్ పై మెరుపులు మెరిపించింది. ఆటో ఎక్స్ పో 2020 వేదికకే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. త‌ర్వాత సినీరంగంపై దృష్టి సారించింది. క‌థానాయిక‌గా వెలిగిపోవాల‌ని క‌లలు గంటోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెతికేస్తున్న ఈ భామకు ఇంకా టాలీవుడ్ గేట్స్ తెరుచుకోవాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఇన్ స్టా వేదిక‌గా చెల‌రేగుతున్న‌ సాక్షి యూట్యూబ్ చానెల్లో ఫిట్నెస్ క్లాసుల‌తో అభిమానుల్ని పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉంది.