Begin typing your search above and press return to search.

సన్ సెట్ లో సామ్.. కూల్ గ్లామర్ డోస్

ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ప్రకృతిని ఆశ్వాదిస్తూ స్వచ్ఛమైన మనస్సుతో స్వేచ్ఛగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది

By:  Tupaki Desk   |   31 Aug 2023 5:27 AM GMT
సన్ సెట్ లో సామ్.. కూల్ గ్లామర్ డోస్
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటిపోతున్న ఇప్పటికే తన గ్లామర్ ఇమేజ్ అలాగే మెయింటేన్ చేస్తోంది. నటిగా మరింత బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ప్రస్తుతం సమంత ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది మాయోసైటిస్ బారిన పడి కోలుకున్న తర్వాత సమంత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.


ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ప్రకృతిని ఆశ్వాదిస్తూ స్వచ్ఛమైన మనస్సుతో స్వేచ్ఛగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఖుషి మూవీ రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. చివరిగా ఖుషి మ్యూజికల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన సమంత యూఎస్ వెళ్ళిపోయింది. అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది.

కొంతకాలం సినిమాలకి, నటనకి దూరంగా ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ అయ్యే ప్రయత్నంలో ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం సామ్ యాక్టివ్ గా ఉంటూ తన డైలీ లైఫ్ లో ఇంటరెస్టింగ్ విషయాలని షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా ఈ అమ్మడు కాలిఫోర్నియాలో సేదతీరుతుంది. అక్కడ ఓ లేక్ వద్ద సూర్యాస్తమయాన్ని ఆశ్వాదిస్తూ ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

వాటికి నొథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇలా సన్ సెట్ ని ఆశ్వాదిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంకేది ముఖ్యం కాదనిపిస్తుంది అనే మీటింగ్ వచ్చే విధంగా ఈ క్యాప్షన్ ఉండటం విశేషం. దీనిని బట్టి సమంత నేచర్ ని ఎంత బాగా ఆశ్వాదిస్తుందో చెప్పొచ్చు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 9.85 లక్షల మంది కేవలం 12 గంటల్లో చూడటం విశేషం. దీనిని బట్టి సమంత లైఫ్ స్టైల్ ని ఎంతమంది ఇష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక శాకుంతలం లాంటి డిజాస్టర్ తో బ్యాక్ కి వెళ్లిన సామ్ మళ్ళీ ఖుషి మూవీతో సూపర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.