సమంత రీచార్జ్ కి కారణాలు ఇవే!
ఇటీవల కాలంలో సమంత మానసిక..ఆరోగ్య సమస్యలకు గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Nov 2023 12:30 PM GMTఇటీవల కాలంలో సమంత మానసిక..ఆరోగ్య సమస్యలకు గురైన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల సమయంలో మానసికంగా ఎంతగా కృంగిపోయిందో ఇన్ స్టా వేదికగా చెప్పుకొచ్చింది. ఆ జ్ఞాపకాలు..బాధని మర్చిపోయేందుకు ఆధ్యాత్మిక యాత్రని చెపట్టి కొంత వరకూ ఉపశమనం పొందింది. ఇదే సమయంలో ఖాళీ లేకుండా సినిమాలు కూడా చేసింది. పనిలో పడితే జ్ఞాపకాల నుంచి బయట పడొచ్చు అన్న కారణంతో ఆ రకంగానూ సామ్ తానేంటో నిరూపించింది.
చివరకి ఎలాగూ మానసిక సమస్యల నుంచి బయట పడింది? అనుకుంటే ఆ వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఆ సమయంలో తానెంతో? బాధకు గురైందో చెప్పుకొచ్చింది. దీంతో సామ్ కొన్నాళ్ల పాటు విరామం అవసరం అని భావంచి సినిమాలకు దూరంగా అమెరికా వెళ్లిపోయింది. ఏడాది పాటు నో మూవీ పాలసీని ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లతో..రేర్ గా అక్కడి అందాల్ని ఆస్వాదిస్తోన్న తీరును వివరిస్తుంది.
తాజాగా అమ్మడు కొత్త ప్రాంతాలకు వెళ్తే తానెంతగా ఎంజాయ్ చేస్తుంది అన్న విషయాన్ని రివీల్ చేసింది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే నాతో నేను గడుపుతున్నట్లు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు నేను చూడాలను కున్న ప్రదేశాల్ని రాసి పెట్టుకుని కుదిరినప్పుడల్లా ఆ ప్రదేశాలకు వెళ్లొస్తా. బాలీ.. క్యాలిఫోర్నియా ..ఆస్ట్రి యా వంటి ఎన్నో ప్రాంతాలు ఇప్పటికే చుట్టేసా. అక్కడ అడవుల్లో ఒంటరిగా నడవడం...సైక్లింగ్ చేయడం.. ఇలా మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల చాలా త్వరగా రీచార్జ్ అవుతుంటా.
ఆ సంతోషాన్ని ఇన్ స్టా వేదికగా అభిమానులతోనూ పంచుకుంటాను` అని అంది. ప్రస్తుతం అమ్మడు అమెరికాలో రీచార్జ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే అమెరికాలో చూడాల్సిన ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ బ్యూటీని కవర్ చేసి తన మార్క్ కొటేషన్ ఇస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.