టీవీలో అవి చూసి కుంగిపోయి చానెల్ మార్చేస్తా!
సమంతలో వైవిధ్యానికి ప్రత్యేకతకు పాపులర్ మ్యాగజైన్ల కవర్ పేజీలు పట్టంగడుతున్నాయి.
By: Tupaki Desk | 9 Nov 2023 4:57 AM GMTప్రతిభ, అందం, తేజస్సు ఇవన్నీ ఒకచోట రాశిగా పోస్తే అది సమంత. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా సామ్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తన క్రాఫ్ట్ పై సామ్ కు ఉన్న అంకితభావం, ఎంపిక చేసిన పాత్రలలో బహుముఖ ప్రజ్ఞ, సామాజిక సేవా ధృక్పథం ఇవన్నీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఇప్పుడు మయోసైటిస్ లాంటి అనారోగ్యం ఉన్నా దానిని అధిగమించేందుకు సమంత చూపిస్తున్న పట్టుదల అందరికీ స్ఫూర్తి.
సమంతలో వైవిధ్యానికి ప్రత్యేకతకు పాపులర్ మ్యాగజైన్ల కవర్ పేజీలు పట్టంగడుతున్నాయి. సామ్ పలుమార్లు ప్రఖ్యాత హార్పర్ బజార్ ఇండియా కవర్ పేజీని అలంకరించింది. ఇప్పుడు మళ్లీ సమంతకు మరో అరుదైన అవకాశం. సామ్ ఐకానిక్ ఫోజ్ ఒకటి షేర్ చేసిన బజార్ ఇండియా ఈ ఫోటోకి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. బజార్ ఇండియా కవర్ స్టార్ సమంత .. ఈ విజయానికి దూరదృష్టి గల సృష్టికర్తలతో జతకట్టడం...ఆమె జీవితకాల నినాదం-నిరంతర అభ్యాసం.. అభివృద్ధిని అనుసరించడం కారణమని పేర్కొంది. ఈ సందర్భంగా హార్పర్ బజార్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో సమంత పలు ఆసక్తికర విషయాలను ప్రస్థావించింది.
credits: Sleeveless bodysuit with tulle neckline from the F/W 2023 Collection, LV iconic bracelet, all Louis Vuitton
13 సంవత్సరాల తర్వాత నేను ఇంకా చాలా తరగతులు చదువుతున్నాను. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను. నేను ఎప్పుడూ మెరుగ్గా ఉండాలని చూస్తున్నాను. ఇది జీవితంలో నా నినాదం అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడూ మెరుగ్గా ఉండటానికి కష్టపడి పనిచేయడం ముఖ్యం. కాబట్టి కష్టపడి పనిచేయడం తప్ప మరేదైనా ప్రక్రియ ఉందని నేను అనుకోను. కొన్నిసార్లు అది స్క్రీన్‌పై ప్రతిఫలిస్తుంది. కొన్నిసార్లు అలా కుదరదు. ఇప్పుడు నేను ప్రతిసారీ హిట్‌లను అందించడంపై దృష్టి పెట్టాలి. మిస్ (ఫ్లాప్)ల కంటే ఎక్కువ హిట్‌లు ఉండేలా చూసుకోవాలి.. అని వ్యాఖ్యానించింది.
credits: Leather accent denim mini dress, Louis Vuitton
సమంతా మాస్కులిన్ బ్లేజర్, ఫాల్ వింటర్ 2023 కలెక్షన్ నుండి స్ట్రెయిట్ లెదర్ ప్యాంటు, పెటిట్ మల్లె బ్యాగ్ - బ్లూమింగ్ చెవిపోగులు, అన్నీ లూయిస్ విట్టన్ (@louisvuitton) బ్యాగ్ ని ధరించింది. సమంత ఇటీవల తన మోడలింగ్ రోజుల గురించి తన ప్రారంభ పనిని చూడడాన్ని అసహ్యించుకుంటానని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యను చేసింది.
credit: Bubble Damier Trucker Jacket, Flocked monogram denim mini skirt, My LV chain necklace, all Louis Vuitton
మోడలింగ్ నుండి నటన వరకు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ సమంత హార్పర్స్ బజార్ ఇండియాతో మాట్లాడుతూ.. నా కెరీర్ ప్రారంభ దశలలో, కళాశాల సమయంలో .. తరువాత కొంతకాలం మోడలింగ్ చేసాను. అయితే ఎన్ని వ్యాపకాలు ఉన్నా, ఎప్పుడూ చదువుపై దృష్టి కేంద్రీకరించేదానిని అని కూడా సమంత చెప్పారు. ప్రతి భారతీయుని లానే తాను కూడా విజయానికి మార్గం విద్య అని నమ్మింది. కాబట్టి సమంతకు చదువు అంటే చాలా ఇష్టం. కాబట్టి కష్టపడని చదువు అవసరమని భావించింది. పరీక్ష రోజున వందోసారి రివైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొనే విద్యార్థులలో ఆమె ఒకరు. కొంచెం తేలికగా తీసుకోమని అమ్మ చెప్పేది. కానీ తనకు చదువు ముఖ్యం. కాబట్టి నటన ఎప్పుడూ మొదటి ఎంపిక కాదు.
ఇంట్లో పరిస్థితులు అంత సులువుగా లేని సమయంలో మోడలింగ్ లో అవకాశం వచ్చిందని, దాని వల్ల తాను తదుపరి చదువులు కొనసాగించలేకపోయానని సమంత వెల్లడించింది. క్లూలెస్‌గా ఉన్నాను. ఎటువంటి ప్రణాళిక లేకుండా తన జీవితంలో అధమ దశలో ఉన్నాను.. అని సమంత తెలిపింది. కానీ మోడలింగ్ సమంతకు ఒక ప్రణాళికను.. లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే కెమెరా ముందు ఉన్నంత వరకు, మోడలింగ్ రోజుల నుండి నేర్చుకున్నవి ఏవీ ఉపయోగించలేదని, అలా చేయకపోతే ఫెయిల్యూర్ గా మిగిలేదానిని అని సమంత అంది. మోడలింగ్ రోజుల్లో తాను అంత గొప్పగా పని చేయలేదని, టీవీలో తన పాత పనిని చూసినప్పుడల్లా గట్టిగా కుంగిపోయి ఛానెల్‌ని మార్చేస్తానని సమంత గుర్తుచేసుకుంది.
గత సంవత్సరం మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడే క్రమంలో నటన నుండి విరామం తీసుకోవడం గురించి జీవితాన్ని కొద్దిగా అనుభవించడం గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మీరు ఎప్పుడూ పెద్ద బ్లాక్‌బస్టర్‌ల కోసం , అవార్డుల కోసం పరిగెత్తే ఆట గురించి ప్రస్థావించింది.
Source : HarpersBazaar.in