అలా మాట్లాడే సరికి ఆ బ్యూటీకి చిర్రెత్తుకొచ్చిందే!
`నాజీవితం.. నా ఇష్టం` వచ్చినట్లు నేనుంటాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. అడగాడానికి మీరెవరు? మీకెలాంటి హక్కు ఉంది? వంటి మాటలు సాధారణంగా రాంగోపాల్ వర్మ నోట వింటాం.
By: Tupaki Desk | 23 July 2023 8:18 AM GMT`నాజీవితం.. నా ఇష్టం` వచ్చినట్లు నేనుంటాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. అడగాడానికి మీరెవరు? మీకెలాంటి హక్కు ఉంది? వంటి మాటలు సాధారణంగా రాంగోపాల్ వర్మ నోట వింటాం. ఎందుకంటే ఆయన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అలాగే బధులిస్తారు. మళ్లీ మళ్లీ తెరవకుండా ఒకే సమాధానంతో నోరు మూయిస్తారు. ఇంకా ఇలాంటి సమాధానాలు ఎక్కువగా విసిగించిన నేపథ్యంలో ఇతరుల నుంచి సర్వసాధరణంగా బయటకు వస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ కూడా ఇలాగే కొన్ని ప్రశ్నలకు బధులిచ్చింది.
ఇటీవల సారా అలీఖాన్ నటించిన `జరా హట్ కే జరా బచ్ కే` సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన కొందరు సారాలో కొన్ని రకాల మర్పులు రావాలని సూచించారు. అయితే అది పాత్ర పరంగానా? లేక వ్యక్తిగతంగానా? అన్నది క్లారిటీ లేదు. వీటిపై సారా అలీఖాన్ రెండు రకాల సమాధానాలు కౌంటర్ గా ఇచ్చింది. `ఇది మంచో..చెడో నాకు నిజంగా తెలియదు. కానీ చాలా మంది నాలో మార్పు రావాలని సూచించారు. కానీ వారు జీవితంలో సహయం చేయలేని విషయాలు కూడా ఉంటాయి.
నేను చేసిన ప్రతీ సినిమాలోనూ పాత్ర కోసం ఎంతో కష్టపడతాను. పాత్ర పరంగా మారాలి అంటే కచ్చితంగా సూచించిన మార్పులు చేసుకుంటాను. కానీ నేను మారాలి? అని వ్యక్తిగతంగా ఎవరైనా భావిస్తే మాత్రం అది చస్తే జరగదు. నేను ఎలా ఉండాలి. ఎలా జీవించాలి? అని డిసైడ్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఈ విషయంలో నేను నాలాగే ఉంటాను. నాకు నచ్చినట్లు జీవిస్తాను. నన్ను నిర్దేశించే అధికారం ఎవరికీ లేదు. భారత పౌరురాలిగా ఎలా నడుచుకోవాలి? అన్నది ఎదుట వారు చెబితే వినే స్థితిలో నేను లేను` అందిం.
అలాగే నాపై సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ విమర్శని..ప్రశంసని చూస్తుంటాను. నా నటన గురించి ఎత్తి చూపితే నాలో తప్పులు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ వ్యక్తిగత జీవితం..నాకున్న నమ్మకాలపై వచ్చే కామెంట్లని మాత్రం పట్టించుకోను` అని తెలిపింది. సారా అలీఖాన్ ఇంత వైలెంట్ గా ఎప్పుడూ స్పందించలేదు. చాలా సందర్భాల్లో చాలా రకాల విమర్శలు ఎదుర్కుంది. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసే సరికి సారా కూడా చేతి వాటం చూపించేంత పని చేసింది.