Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల తార టాప్ యాంగిల్‌ షో

నాలుగు పదుల వయసులో కూడా బుల్లి తెర, వెండి తెర మరియు సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది

By:  Tupaki Desk   |   20 April 2024 6:47 AM GMT
పిక్ టాక్ : అందాల తార టాప్ యాంగిల్‌ షో
X

1999 లో బాలీవుడ్‌ లో మాన్ సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్ సినిమాలతో కంటే బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా దక్కని గుర్తింపు సీరియల్స్ లో నటిగా దక్కడంతో సుదీర్ఘ కాలం పాటు బుల్లితెర ఇండస్ట్రీలో కొనసాగింది.

నాలుగు పదుల వయసులో కూడా బుల్లి తెర, వెండి తెర మరియు సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందుకే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

షామా సికిందర్ మరోసారి సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టించింది. ఈసారి విభిన్నంగా కెమెరా టాప్ యాంగిల్‌ లో ఉండగా ఫోజ్‌ లు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ థైస్ అందాలను చూపిస్తున్న షామా సికిందర్ అందానికి ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు చూసిన చాలా మంది.. ఇంతటి అందగత్తెకు ఎందుకు సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగా అందంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.