డెబ్యూ నటి వెండి ధగధగలు
కపూర్ కాంపౌండ్ నుంచి సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ కథానాయికలుగా వెలుగులు విరజిమ్మారు. ఆ తర్వాత ఖుషీ కూడా బరిలో దిగుతోంది
By: Tupaki Desk | 2 Dec 2023 1:53 AM GMTఆమె డ్రెస్ అనవసరంగా చాలా పొట్టిగా ఉంది! యువకథానాయిక దుస్తులపై కామెంట్ ఇది. డెబ్యూ కథానాయిక షానాయ కపూర్ ఒక ఈవెంట్ లో ఇలా కనిపించినందున డ్రెస్సింగ్ సెన్స్ పై క్రూరంగా ట్రోల్ చేసారు. వివరాల్లోకి వెళితే..అదీ సంగతి!
కపూర్ కాంపౌండ్ నుంచి సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ కథానాయికలుగా వెలుగులు విరజిమ్మారు. ఆ తర్వాత ఖుషీ కూడా బరిలో దిగుతోంది. ది ఆర్చీస్ తో ఖుషి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఇదే కపూర్ కుటుంబం నుంచి బరిలో దిగుతున్న షానయా కపూర్ కూడా లైమ్ లైట్ లో షో స్టాపర్ గా నిలుస్తోంది. తన సోదరీమణులు సోనమ్, జాన్వీలకు ధీటుగా షానయా కపూర్ ఫ్యాషనిస్టాగా వెలిగిపోయేందుకు చేయని ప్రయత్నం లేదు.
బాలీవుడ్ నిర్మాత సంజయ్ కపూర్ కుమార్తె షానయ కపూర్ తనవైన సొగసరి లుక్స్ తో కట్టి పడేస్తోంది. వరుసగా అద్భుతమైన ఫోటోషూట్‌లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తనకు కూడా జాన్వీలానే లక్షలాదిగా ఫాలోవర్స్ ఉన్నారు. షానయ యువతరం హృదయాలను శాసిస్తోంది. షానాయ కపూర్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనట్లుగా ఇంటర్నెట్ అంతటా వైరల్ అవుతున్న వీడియో ఉంది. నిజానికి ఈ బ్యూటీ తన దుస్తులలో చాలా స్పైసీగా చాలా అందంగా కనిపిస్తోంది. అభిమానులంతా తనపై ప్రేమను కురిపిస్తున్నారు. ఒకవైపు అభిమానులు నటిని ప్రశంసిస్తూ, అభినందిస్తూనే మరోవైపు వివిధ కారణాలతో షానయను ట్రోల్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
మరీ అంత పొట్టి డ్రెస్ వేసుకోనవసరం లేదు. అనవసరంగా పొట్టి దుస్తులను ధరించింది! అని ఒక అభిమాని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ``వరస్ట్ డ్రెస్డ్ కాంపిటీషన్ స్టార్టయింది`` అంటూ ఒక అభిమాని కామెంట్ చేసాడు. కొందరు షానయ ఎంతో ప్రెట్టీగా ఉందని, ఆ డ్రెస్ ఏమంత బాలేదని వ్యాఖ్యానించారు. షానయ ఎంపిక చేసుకున్న వెండి తళతళల డిజైనర్ డ్రెస్ నిజానికి ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఎంపిక చేసుకున్న వెండి థీమ్ నేపథ్యంలో ఫోటోషూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ ట్రోలర్లు మాత్రం విడిచిపెట్టడం లేదు.