లెహంగాలో షానాయా చిచ్చరపిడుగులా!
ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో ఇన్ స్టాలో అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది
By: Tupaki Desk | 15 Dec 2023 5:30 PM GMTముఖానికి మ్యాకప్ వేసుకోవడానికే ముందే ప్యాకప్ చెప్పడం ఎలాగో? తెలుసుకుంది షానాయా కపూర్. జాన్వీకపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా'కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇండస్ట్రీ వాతావరణం అలవాటు చేసుకుంటుంది. కెమెరా వెనుక పరిస్థితులు ఎలా ఉంటాయి? కెమెరా ముందు ఎలా ఉంటాయి? వంటి వివరాలు అస్టిస్టెంట్ గా పనిచేసి తెలుసుకుంది.
కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చే ముందు కొన్ని రకాల అనుభవాలు భవిష్యత్ కి మంచిదే కదా అని భావించి ఆ రకంగా పరిశ్రమలో లాంచ్ అయింది. సిసలైన ప్రయాణం 2024 లో మొదలు పెట్టబోతుంది. ఈ బ్యూటీనీ కూడా కరణ్ జోహార్ పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసం సన్నధం అవుతుంది. ఇక అమ్మడి సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో ఇన్ స్టాలో అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తనదైన మార్క్ ఎలివేషన్లతో కుర్రకారుని ఆకర్షిస్తుంది. తాజాగా షానాయా మరో హాట్ ఫోటోతో నెటి జనుల ముందుకొ చ్చేసింది. ఇదిగో ఇక్కడిలా డిజైనర్ లెహంగాలో సెగలు పుట్టించే భంగిమతో ఆకట్టుకుంటుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆస్తా శర్మ లెహంగా సెట్‌లో షనాయను ఇలా స్టైల్ చేసింది. బహుళ-రంగు పూల ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన ఐవరీ లెహంగా స్కర్ట్.. బ్లౌజ్ -దుపట్టాలో అమ్మడు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఎత్తైన నడుము A-లైన్ సిల్హౌట్.. స్కాలోప్డ్ బార్డర్‌లు.. సీక్విన్ అలంకారాలు.. ప్లవర్ అప్లిక్ వర్క్.. బీడ్ ఎంబ్రాయిడరీ అమ్మడిని మరింత అందంగా మలిచాయి. నెక్ పై అమ్మడు ఎంపిక చేసుకున్న నెక్లెస్..చెవి పోగులు ప్రతీది లెహంగాని పక్కాగా మ్యాచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానుల్ని ఆ ఫోటో ఎంతో ఆకట్టుకుంటోంది.