Begin typing your search above and press return to search.

25 ఏళ్ల హాట్ బ్యూటీలా 48 ఏళ్ల‌ ప్రాయం?

శిల్పాశెట్టి గ్లామ‌ర్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు బేసిక్ గానే ఫిట్ నెస్ ప్రియురాలు. ఆ వీడియోలు నెట్టింట వైర‌ల్ చేసే బోలెడంత పాపుల‌ర్ అయింది

By:  Tupaki Desk   |   2 Oct 2023 10:39 AM GMT
25 ఏళ్ల హాట్ బ్యూటీలా 48 ఏళ్ల‌ ప్రాయం?
X

శిల్పాశెట్టి గ్లామ‌ర్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు బేసిక్ గానే ఫిట్ నెస్ ప్రియురాలు. ఆ వీడియోలు నెట్టింట వైర‌ల్ చేసే బోలెడంత పాపుల‌ర్ అయింది. న‌టిగా బిజీగా లేక‌పోయినా ఇన్ స్టా ద్వారానే అమ్మ‌డు భారీగా ఆదాయం స‌మ‌కూర్చుకుంటుంది. 48 ఏళ్ల వ‌య‌సులోనూ న‌వ నాయిక‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సాగ‌ర‌క‌న్య‌ ఎలివేష‌న్ల‌కు పిదా అవ్వాల్సిందే. ఆల్ట్రామోడ్ర‌న్ దుస్తుల్లో అమ్మ‌డు సంచ‌ల‌నాలు అన్నిఇన్ని కావు.


ఈ విష‌యంలో నేటిత‌రం నాయిక‌ల‌కు శిల్ప‌శెట్టి ఓ రోల్ మోడల్ లాంటింది. వ‌య‌సు ముదిరే కొద్ది మ‌రింత అందంగా ఎలా క‌నిపించాలో? తెలియాలంటే సార‌గ‌క‌న్య చిట్కాలు క‌చ్చితంగా అనుస‌రించాల్సిందే. తాజాగా శిల్పా శెట్టి మ‌రో న్యూ డిజైన్ లో త‌ళుకులీనింది. ఈ దుస్తుల్లో 48 ఏళ్ల న‌టి 25 ఏళ్ల ప్రాయం ఉన్న భామ‌గా ఆక‌ట్టుకుంటుంది. సిజ్లింగ్ రెడ్ మినీ డ్రెస్‌లో వావ్ అనిపిస్తుంది. అమ్మ‌డి ముఖానికి అద్దిన మ్యాక‌ప్.. పెదాల‌కు ముదురు ఎరుపు రంగు లిప్ స్టిక్ పూసింది. కాళ్ల‌కు సొగ‌సైన బ్లాక్ హైహీల్స్ ధ‌రించింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పెళ్లైనా..ఓ బిడ్డ‌కు త‌ల్లైనా శిల్పా అందంలో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు? న‌వ నాయిక‌లు నీ నుంచి పోటీనీ ఎలా త‌ట్టుకోగ‌ల‌రు? అంటూ నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అమ్మ‌డి వ‌య‌సు ఆమాంతం 25 ఏళ్లు తగ్గిపోయింద‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేసాడు. బాలీవుడ్ లో శిల్పాశెట్టి సినిమాలు చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ తోనే ల‌క్ష‌లు సంపాదిస్తోంది.

ఇన్ స్టా ద్వారానే భారీ ఆదాయం స‌మ‌కూరుతుంది. శిల్పా శెట్టి బాలీవుడ్ లోనే ప్ర‌య‌త్నాలు చేస్తోంది త‌ప్ప‌! టాలీవుడ్ పై మాత్రం ఫోక‌స్ చేస్తున్న‌ట్లు క‌నిపించ‌ల‌దే. ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు చేసిన అమ్మ‌డు సెకెండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా బాలీవుడ్ పైనే ఆధార‌ప‌డింది. ఇక్క‌డా ఓ ప్ర‌య‌త్నం చేస్తే! త‌ప్పేముంది సాగ‌ర‌క‌న్యా.