Begin typing your search above and press return to search.

న‌డుము నాభి చూపిస్తూ సీనియ‌ర్ న‌టి హొయ‌లు

నేటి అధునాత‌న ప్ర‌పంచంలో ఫ్యాష‌న్ పోక‌డ‌లు షాక్ కి గురి చేస్తున్నాయి. కొత్తొక వింత పాతొక రోత‌! అన్న తీరుగా మారింది

By:  Tupaki Desk   |   19 March 2024 5:37 AM GMT
న‌డుము నాభి చూపిస్తూ సీనియ‌ర్ న‌టి హొయ‌లు
X

నేటి అధునాత‌న ప్ర‌పంచంలో ఫ్యాష‌న్ పోక‌డ‌లు షాక్ కి గురి చేస్తున్నాయి. కొత్తొక వింత పాతొక రోత‌! అన్న తీరుగా మారింది. ఫ్యాష‌న్ పోక‌డ‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేసేందుకు సీనియ‌ర్ న‌టీమ‌ణులు, జూనియ‌ర్ తార‌లు అనే తేడా లేదు. జాన్వీ క‌పూర్, సారా అలీఖాన్, అన‌న్య పాండే లాంటి భామ‌లు ఫ్యాష‌న్ ఎంపిక‌ల ప‌రంగా వంద‌శాతం ప్ర‌యోగాల‌కు వెళుతుంటారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు సీనియ‌ర్ బ్యూటీ శిల్పాశెట్టి స్టింట్ అంద‌రినీ షాక్ కి గురి చేస్తోంది. శిల్పాశెట్టి త‌న న‌డుము నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శించే బోల్డ్ డిజైన‌ర్ ఫ్రాకులో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం దీనిపై తీవ్ర‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది.

ఇద్ద‌రు పిల్ల‌ల మ‌మ్మీ ఇలా చేయొచ్చా? అంటూ కొంద‌రు శిల్పాశెట్టిని ప్ర‌శ్నిస్తున్నారు. బ్లాక్ కటౌట్ డ్రెస్‌లో ఉన్న శిల్పా ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. అయితే ఈ డిజైన‌ర్ దుస్తులలో ప్లాస్టిక్ సీక్వెన్స్ ఎబ్బెట్టుగా ఉంద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఒక నెటిజ‌న్ 'హిప్ బోన్స్' బయటకు వచ్చినట్లుగా ఉంది ... అని జోక్ చేసాడు. మరొకరు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తిరస్కరించడం.. పునర్వినియోగం ఉత్తమ ప్రచారం... కానీ శిల్పా ప్లాస్టిక్ ని వినియోగిస్తోంది అని ఒక అభిమాని కామెంట్ చేసారు. అంతకుముందు కూడా శిల్పా శెట్టి జిమ్ దుస్తులు ధరించి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇస్తూ ఫిట్‌నెస్ రొటీన్‌లలో సమతుల్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.

ఫిట్‌నెస్ అండ్ ఫ్యాషన్‌పై ఎల్ల‌పుడూ దృష్టిని కేంద్రీకరించే శిల్పాశెట్టి టీవీ రియాలిటీ షోల‌తోను బిజీగా ఉంది. ఇటీవ‌లే ఓటీటీలోను ప్ర‌త్య‌క్ష‌మైంది. రోహిత్ శెట్టి ది పోలీస్ ఫోర్స్ లో త‌న న‌ట‌న‌కు అద్బుత ప్ర‌శంసలు కురిసాయి. తన త‌దుప‌రి చిత్రం 'కెడి - ది డెవిల్' విడుద‌ల కోసం వేచి చూస్తోంది. ఈ క‌న్న‌డ చిత్రంలో సంజయ్ దత్ , జిషు సేన్‌గుప్తాల‌తో కలిసి శిల్పా శెట్టి న‌టిస్తోంది.