Begin typing your search above and press return to search.

శివాని రాజశేఖర్.. వ్వాటే గ్లామర్ డోస్

టాలీవుడ్ లో సెలబ్రెటీల వారసత్వంతో హీరోయిన్స్ గా అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు ఎవ్వరూ కనిపించరు

By:  Tupaki Desk   |   6 Aug 2024 4:40 AM GMT
శివాని రాజశేఖర్.. వ్వాటే గ్లామర్ డోస్
X

టాలీవుడ్ లో సెలబ్రెటీల వారసత్వంతో హీరోయిన్స్ గా అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు ఎవ్వరూ కనిపించరు. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తల్లిదండ్రులు కూడా ఒకప్పటి స్టార్స్ గా ఉన్నవారే. తల్లిదండ్రుల వారసత్వంతో నటీమణులుగా ఎంట్రీ ఇచ్చి తరువాత సూపర్ సక్సెస్ అయిన వారు చాలామంది కనిపిస్తారు. ఇక తెలుగులో చాలా మంది బ్యూటీస్ ఈ మధ్య యాక్టింగ్ ని కెరియర్ ఎంచుకుంటున్నారు.

కానీ సెలబ్రెటీ కుటుంబాల నుంచి హీరోయిన్స్ గా అడుగుపెడుతున్నవారు మాత్రం తక్కువ మంది కనిపిస్తారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో నటించింది. తరువాత చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకొని గూఢచారి సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా మంజుల నటిగా అడుగుపెట్టింది. అయితే ఎక్కువ సినిమాలు చేయలేదు.

మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక కొణెదల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేదు. రాజశేఖర్, జీవిత నట వారసులుగా వారి కూతుళ్లు శివాని, శివాత్మిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. శివాని రాజశేఖర్ పెళ్లి సందడి సినిమాలో చిన్న రోల్ లో నటించింది. రోషన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. అద్భుతం మూవీతో పూర్తిస్థాయి హీరోయిన్ గా శివాని కెరియర్ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి రెగ్యులర్ గా మూవీస్ చేస్తూనే వస్తోంది. తమిళంలో రెండు సినిమాలలో శివాని రాజశేఖర్ నటించింది.

గత ఏడాది కోట బొమ్మాళి పీఎస్ సినిమాతో సక్సెస్ అందుకున్న శివాని ఈ ఏడాది వింధ్య వాసుల అహం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో శివాని నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్లామర్ విషయంలో లిమిటేషన్ పెట్టుకున్న ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కూడా అందంగా కనిపించొచ్చని ఆమె ఫోటోషూట్ లు చూస్తుంటే తెలుస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో శివాని చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా చిరుత కలర్ లో ఉన్న లాంగ్ ఫ్రాక్ లో హైహీల్స్ వేసుకొని శివాని తీసుకున్న ఫోటో స్టిల్ మెస్మరైజింగ్ గా ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. కళ్ళతో మాయ చేస్తోన్న శివాని సౌందర్యం స్వర్గంలో ఏంజిల్ లా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమె అందం, అభినయానికి తగ్గ క్యారెక్టర్స్ పడితే కచ్చితంగా సౌత్ లో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందని శివాని ఫ్యాన్స్ అంటున్నారు.