Begin typing your search above and press return to search.

బ్యాక్ షోతో శివాత్మిక మాయ.. ఆ 'ముడి'తోనే ముడిపెడుతూ!

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు హీరోయిన్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   26 July 2024 3:00 PM GMT
బ్యాక్ షోతో శివాత్మిక మాయ.. ఆ ముడితోనే ముడిపెడుతూ!
X

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు హీరోయిన్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శివాత్మిక రాజశేఖర్.. దొరసాని మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే శివాత్మిక మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా అమ్మడు ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.

శివాత్మిక అందాలకు యూత్ అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత పంచతంత్రం మూవీలో కాసేపు కనిపించింది. ఆ మధ్య కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండలో నటించింది శివాత్మిక. నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రలో యాక్ట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆకట్టుకోలేకపోయినా శివాత్మిక నటనతో వావ్ అనిపించింది. రీసెంట్ గా సీనియర్ నటుడు శ్రీకాంత్ కోటబొమ్మాలి మూవీలో యాక్ట్ చేసింది. ఆ మూవీతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన శివాత్మిక రాజశేఖర్.. ఇప్పుడిప్పుడు మెల్లగా గాడిలో పడుతుంది. విలక్షణమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ తన రోల్‌ కు ప్రాధాన్యమున్న పాత్రలకే ఓకే చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది శివాత్మిక రాజశేఖర్. నిత్యం తన అభిమానులతో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తుంటోంది.

పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపు తన వైపునకు తిప్పుకుంటోంది. ఇక శారీల్లో శివాత్మిక వేరే లెవెల్ పిక్స్ ను షేర్ చేస్తుంటోంది. చీరల్లో కూడా అందాలు ఆరబోయవచ్చని ప్రూవ్ చేస్తుంటోంది. సింపుల్ బ్లౌజెస్ వేసుకుంటూనే.. అందరి కళ్లు అక్కడ పడేలా చేస్తోంది. దీంతో శివాత్మిక శారీ ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. తాజాగా క్రీమ్ కలర్ చీరలో పిక్స్ పోస్ట్ చేసింది అమ్మడు. వైట్ కలర్ లవ్ ఎమోజీని క్యాప్షన్ గా ఇచ్చింది.

వెనక్కి తిరిగి కూర్చుని కెమెరాకు పోజులిచ్చింది శివాత్మిక. బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసుకున్న అమ్మడు.. బ్యాక్ షోతో మాయ చేస్తోంది. బ్లౌజ్ కు ఉన్న ముడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. నడుము ఒంపులతో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. జుట్టును పక్కకు తీసి ఐకానిక్ పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. వావ్, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫైర్ ఎమోజీలను పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి శివాత్మిక అందాల జాతర మీరు చూశారా?