శ్రద్దా.. ఎలా కనిపించినా అరాచకమే..
తాజాగా, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. సూపర్ స్టైలిష్ గా ఆ ఫోటోలో ఉండటం విశేషం
By: Tupaki Desk | 28 Aug 2023 7:43 AM GMTతెలుగు ప్రేక్షకులకు శ్రద్దాదాస్ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో తన నటన, అందంతో అందరినీ మెప్పించింది. నిజానికి హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, పాపం ఆ కోరిక మాత్రం నెరవేరలేదు. మొదట సెకండ్ హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించి, తర్వాత సపోర్టెడ్ రోల్స్ కి పరిమితమైంది.
నిజానికి, శ్రద్ధా దాస్ కి హీరోయిన్ అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎత్తు, మంచి ఫిజిక్, అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు. కానీ అదృష్టం కలిసిరాక హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందాలతో మెస్మరైజ్ చేయడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు.
తాజాగా, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. సూపర్ స్టైలిష్ గా ఆ ఫోటోలో ఉండటం విశేషం. బ్లాక్ లకర్ ప్యాంట్ కి, షార్ట్ రెయిన్ బో కలర్ టాప్ ధరించింది. ఇక, ఆ డ్రెస్ లో తన క్లీవేజ్ అందాలు క్లియర్ గా కనిపించేలా ఫోజులు ఇవ్వడం విశేషం. చేతికి ఓ క్లాసీ వాచ్ ఆమె లుక్ కి మరింత అందం తీసుకువచ్చింది. చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని ఉంది. ఆ ఫోటో కూడా ఏదో ఐస్ క్రీం పార్లర్ లో తీసినట్లుగా అనిపిస్తోంది.
ఫోటో ఎక్కడ దిగితే ఏంటి? శ్రద్ధా మాత్రం స్టన్నింగ్ గా కనపడుతోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఆమె ఫోటోలకు ప్రస్తుతం లైకుల వర్షం కురుస్తోంది. వారెవ్వా ఏం అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం శ్రద్ధా చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.
సినిమాల్లో ఆఫర్లు లేకపోయినా, ఆమె మొన్నటి వరకు బుల్లితెరపై సందడి చేశారు. ఓ డ్యాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించారు. ఆ షోలో నూ ఆమె తన దైన స్టైల్ లో అందాలను ఎరబోస్తూ ఆకట్టుకునేవారు. ఇప్పుడు ఆ షో కూడా అయిపోయింది. మంచి ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, శ్రద్ధా దాస్ ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె అందానికి అందరూ ఆకర్షితులయ్యారు. ఆ సినిమాలో ఆమె బోల్డ్ గా కనిపించగా, అప్పటి నుంచి ఆమెకు బోల్డ్ ఛాన్స్ లే వచ్చాయి. ఆర్య2, డార్లింగ్, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో ఆకట్టుకుంది.