Begin typing your search above and press return to search.

శ్రద్ధా దాస్.. 37లో కూడా హీటెక్కించే అందం

టాలీవుడ్‌ లో శ్రద్ధా దాస్ అనే పేరు వినగానే, తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే ప్రధాన విషయం ఆమె గ్లామర్‌ షో

By:  Tupaki Desk   |   17 Aug 2024 2:30 PM GMT
శ్రద్ధా దాస్.. 37లో కూడా హీటెక్కించే అందం
X

టాలీవుడ్‌ లో శ్రద్ధా దాస్ అనే పేరు వినగానే, తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే ప్రధాన విషయం ఆమె గ్లామర్‌ షో. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టిన శ్రద్ధ, ఆ సినిమా ద్వారా పెద్ద విజయాన్ని సాధించకపోయినా, తన అందం, నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ సినిమాలో, ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తరువాత వచ్చిన ఆర్య-2 సినిమాలో కూడా శ్రద్ధా నటించారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌ లో వచ్చిన ఈ సినిమా శ్రద్ధా దాస్‌ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చినా, స్టార్ హీరోయిన్‌గా మాత్రం మారలేకపోయింది. తెలుగు సినిమాలతో పాటు హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.

శ్రద్ధా దాస్ నటించిన హిందీ సినిమాలు లాహోర్, దిల్ తో బచ్చా హై, తీన్ పహేలియా వంటి చిత్రాలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగులో ఇటీవల నిరీక్షణ సినిమాలో నటించిన ఆమె, ప్రస్తుతం ఒక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు సినిమాల్లోనూ, ఇటు వెబ్ సిరీస్‌ లలో కూడా శ్రద్ధా దాస్ దూసుకుపోతోంది. ఖాకీ బీహర్ ఛాప్టర్ వంటి వెబ్ సిరీస్ లో శ్రద్ధ పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది.

సోషల్ మీడియాలో శ్రద్ధా దాస్‌కి ఉన్న క్రేజ్ వేరు. తరచూ గ్లామర్ పిక్స్‌తో నెటిజన్లను అలరిస్తుంటుంది. శ్రద్ధా పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల అమ్మడు ఎద అందాలతో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. 37 ఏళ్ళ వయసులో కూడా అమ్మడు ఇంకా పాతికేళ్ళ అమ్మాయి తరహాలోనే అందంగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40కు పైగా చిత్రాల్లో నటించిన శ్రద్ధా, వెబ్ సిరీస్‌లలో కూడా వరుస అవకాశాలు పొందుతోంది. మరి ఆమె తన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.