ఎంత పెద్ద స్టార్ అయినా ఐ డోంట్ కేర్!
అందులోనూ ఖాన్ ల సరసనన..కపూర్ బోయ్స్ సరసన ఛాన్స్ వస్తే ఏ భామ అస్సలు వదులుకోదు. కాదనకుండా ఎలాంటి సన్నివేశాలకైనా సై అంటుంది
By: Tupaki Desk | 23 Aug 2024 7:44 AM GMTస్టార్ హీరోల చిత్రాల్లో అవకాశమంటే ఏ హీరోయిన్ అన్నా ఎగిరి గంతేస్తుంది. అలాంటి అవకాశం ఎప్పుడొ స్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. వచ్చిన తర్వాత ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. పట్టలేని ఆనందానికి గురవుతుంది. అందులోనూ ఖాన్ ల సరసనన..కపూర్ బోయ్స్ సరసన ఛాన్స్ వస్తే ఏ భామ అస్సలు వదులుకోదు. కాదనకుండా ఎలాంటి సన్నివేశాలకైనా సై అంటుంది.
కానీ ఈ బ్యూటీ మాత్రం అందుకు మినహాయింపు. ఎంత పెద్ద హీరో అయినా? ఐడెంట్ కేర్ అంటూ ముందుకెళ్తుందిట. ఇంతకీ ఎవరా? భామ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె ఎవరో కాదు శ్రద్దా కపూర్. బాలీవుడ్ లో అమ్మడి జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మడు అనతి కాలంలో స్టార్ గా ఎదిగింది. బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటే నాయికని ప్రూవ్ చేసుకుంది.
ఇటీవల రిలీజ్ అయిన స్త్రీ-2 తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. వందల కోట్ల రికార్డు వసూళ్లతో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో తానో బ్రాండ్ అని మరోసారి ప్రూవ్ చేసింది. కరీనాకపూర్, దీపికా పదుకొణే లాంటి స్టార్ భామలకే సాధ్యం కానిది అమ్మడు సాధించి చూపిస్తుంది. మరి ఈ సక్సెస్ ల నుంచి పుట్టిన తెగింపా? అమ్మడి స్వభామవే ఇంతేనా? అన్నది తెలియదు గానీ, తాను ఎలాంటి సినిమా చేసినా అందులో తన పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మాత్రమే చూస్తుందిట.
తన పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఉంటేనే ఆసినిమాకి సైన్ చేస్తుందిట. లేదంటే అందులో ఎంత పెద్ద స్టార్ అయినా నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందిట. దర్శక, నిర్మాతలు ఎంత కన్విన్స్ చేయాలని చూసినా అంగీకరించదట. అలాంటి అవకాశాలు ఇప్పటికే చాలా వదులుకున్నట్లు చెప్పింది. ముగ్గురు ఖాన్ లతో ఒకేసారి పనిచేసే అవకాశం వచ్చినా? నో చెప్పే విషయంలో తానెంతమాత్రం బాధపడనంటోంది. హీరోయిన్ గా ఎదగాలంటే ఎంచుకునే పాత్ర సవాల్ చేసేలా ఉండాలి? అంటోంది. లేకపోతే అలాంటి పాత్రలు చేయడం సుద్ద దండగ అంటోంది.