Begin typing your search above and press return to search.

రియ‌ల్ బ్యూటీని మించి మిర‌ర్ లో!

ఏ ఇతర నాయికకు సాధ్యం కానిది శ్రీయకు మాత్రమే ఇది సాధ్యమైనది. కానీ కెరీర్ ప‌రంగా అమ్మ‌డు దూకుడు మాత్రం బాగా త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది

By:  Tupaki Desk   |   21 March 2024 10:08 AM GMT
రియ‌ల్ బ్యూటీని మించి మిర‌ర్ లో!
X

శ్రియ శరన్ వైరల్ సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా నెటిజ నుల్లో.. అభిమానుల్లోనూ నిరంతరం హాట్ టాపిక్ గా మారడం బ్యూటీ ప్రత్యేకత. ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా యువత గుండెల్లో నిలుస్తుంది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో? ఇప్పటికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది.

ఏ ఇతర నాయికకు సాధ్యం కానిది శ్రీయకు మాత్రమే ఇది సాధ్యమైనది. కానీ కెరీర్ ప‌రంగా అమ్మ‌డు దూకుడు మాత్రం బాగా త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. మునుప‌టిలా వేగం ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతుంది. 2022 లో మూడు సినిమాలతో అల‌రించిన అమ్మ‌డు గ‌తే ఏడాది కేవ‌లం 'క‌బ్జా'..'మ్యూజిక్ స్కూల్' లాంటి చిత్రాల్లోనే న‌టించింది. ఆ రెండు కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన 'క‌బ్జా' రొటీన్ స్టోరీగా తేలిపోవ‌డంతో శ్రియ ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్ర‌య‌త్నంగా మిగిలిపోయింది.

అప్ప‌టికే చేతిలో ఉన్న పెద్ద అవ‌కాశం అదొక్క‌టే. కానీ తాను ఒక‌టి అనుకుంటే ఫ‌లితం మ‌రోలా వ‌చ్చింది. మ‌రో చిన్న సినిమా కావ‌డంతో ఆ ప్రాజెక్ట్ పై పెద్ద‌గా ఆశ‌లేం పెట్టుకోలేదు. కానీ తెలుగు సినిమా కావ‌డంతో కంబ్యాక్ కి పనికొస్తుంద‌ని భావించిది గానీ ప‌న‌వ్వ‌లేదు. అప్ప‌టికే అమ్మ‌డు తెలుగు సినిమా చేసి మూడు-నాలుగేళ్లు అవుతుంది. బోయ్స్ లో క్రేజ్ అయితే ఉంది గానీ...ఇంకా న‌టిగా అల‌రిస్తుందా? అన్న విమ‌ర్శ ఇక్క‌డ లేక‌పోలేదు.

ఆ ర‌కంగా టాలీవుడ్ లో వెనుక‌బ‌డింది. ప్ర‌స్తుతం అమ్మ‌డికైతే చేతిలో అవ‌కాశాలు లేవు. హిందీలో మాత్రం 'షో టైమ్' అనే ఓటీవీ సిరీస్ చేస్తుంది. ఇది త‌ప్ప ఛాన్సులేవి లేవు. తాజాగా అమ్మ‌డు ఇన్ స్టాలో ఓ హాట్ ఫోటో షేర్ చేసింది. అందులో అమ్మ‌డు చిట్టిపొట్టి దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. గోల్డ్ క‌ల‌ర్ డిజైన్ ల్లో శ్రియ సెగ‌లు రేపిన‌ట్లే క‌నిపిస్తుంది. ఆ అందాల్ని మిర‌ర్ లో రిప్లెక్ట్ చేసి మ‌రీ షో చేసింది. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.