Begin typing your search above and press return to search.

శ్రుతి హాస‌న్ కూడా బాడీ గార్డుల‌ను దించుతుందా!

జనాల్లోకి వస్తే హీరోయిన్ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలిసిందే. అభిమానులైతే సెల్పీలం టూ మీద ప‌డ‌తారు

By:  Tupaki Desk   |   26 Sep 2023 3:00 AM GMT
శ్రుతి హాస‌న్ కూడా బాడీ గార్డుల‌ను దించుతుందా!
X

జనాల్లోకి వస్తే హీరోయిన్ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలిసిందే. అభిమానులైతే సెల్పీలంటూ మీద ప‌డ‌తారు. ఆక‌తాయిలైతే అక్క‌డా....ఇక్క‌డా తాక‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ప‌బ్లిక్ లోకి వ‌స్తే ఈ ర‌క‌మైన ఇబ్బందులు త‌ప్ప‌వు. వాటిని చాలా వ‌ర‌కూ చూసి చూడ‌న‌ట్లే పోతారు. మ‌రి శ్రుతి మించిపోతే త‌ప్ప‌! ప్ర‌తి దాడికి ప్ర‌య‌త్నించ‌రు. వెనుక బాడీ గార్డులున్నా! ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. వేల‌ల్లో ఉన్న జ‌నాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం. కాబ‌ట్టి హీరోయిన్లు ఈ విష‌యంలో కాస్త స‌మ‌య‌మ‌నంతోనే ఉంటారు.

అయితే కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్రం అంతే భ‌యాన‌కంగానూ అనిపిస్తాయి. శ్రుతి హాస‌న్ ఇటీవ‌ల ముంబై ఎయిర్ పోర్టులో ఇలాంటి అనుభ‌వాన్ని ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. ఆ దుండగుడు అమ్మ‌డిని కార్ పార్కింగ్ వ‌ర‌కూ వెంబ‌డించిన విష‌యం తెలిసిందే. అత‌ను శ్రుతిహాస‌న్ ని పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌న‌ప్ప‌టికీ ఒంట‌రిగా ఉండ‌టంతో భ‌య‌ప‌డింది. అలాగే ఆ దుండ‌గుడు కొన్ని ర‌కాల చేష్ట‌లు ఆ ర‌క‌మైన వాతావ‌ర ణంలో కి తీసుకెళ్లాయి. దీంతో శ్రుతి హాస‌న్ అలెర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇక‌పై ఇలాంటి భ‌యాల‌కు గురికాకుండా వ్య‌క్తిగ‌త బాడీ గార్డుల‌ను నియ‌మించుకుందిట‌. ఇలాంటి వారి ఆట క‌ట్టించాలంటే అలాంటి వారు ఉండాల్సిందేన‌ని అమ్మ‌డు డిసైడ్ అయిన‌ట్లుంది. ఇక‌పై ఆక‌తాయిల ఆట క‌ట్టించ‌డానికి బాడీ గార్డుల్ని దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాడీ గార్డుల‌ను నియ‌మించు కోవాల్సి ఉంద‌ని..కానీ వ్య‌క్తగ‌త స్వేచ్ఛ‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే ఇంత‌కాలం నియ‌మించ‌లేద‌ని అంటోంది. ముంబై ఘ‌ట‌న త‌ర్వాత ఏమాత్రం ఆల‌స్యం చేయ‌బోను అంటోంది.

అంటే ఇక‌పై శ్రుతి హాస‌న్ వెంట ర‌క్ష‌ణ సిబ్బంది ఉంటార‌ని తెలుస్తోంది. ఆమె విదేశాలు వెళ్తే త‌ప్ప‌! ఇండియాలో ఎక్క‌డ తిరిగినా వెంట వాళ్లు ఉంటారు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఎలాగూ నిర్మాత‌లు ఆ ర‌క‌మైన సౌక‌ర్యం క‌ల్పిస్తారు కాబ‌ట్టి ఇబ్బంది లేదు. వ్యక్తిగ‌త ప‌నులు మీద బ‌య‌ట‌కు వెళ్తే ఇలాంటి వారి అవ‌స‌రం ప‌డుతుంది. కాబ‌ట్టి శ్రుతి హాస‌న్ కూడా కంగ‌న‌లా బాడీ గార్డులు దించుతుంది.