Begin typing your search above and press return to search.

సలార్‌ విడుదలకు ముందే ఆమె బిజీ బిజీ

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమాలో హీరోయిన్‌ గా శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   15 Dec 2023 7:38 AM GMT
సలార్‌ విడుదలకు ముందే ఆమె బిజీ బిజీ
X

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమాలో హీరోయిన్‌ గా శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఇంకా విడుదల అవ్వకుండానే శృతి హాసన్‌ కు వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అడివి శేష్‌ హీరో గా రూపొందబోతున్న ఒక సినిమా లో శృతి హాసన్ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.


ట్యాలెంటెడ్‌ హీరోగా పేరు దక్కించుకుని వరుస విజయాలతో దూసుకు పోతున్న అడివి శేష్‌ తో సినిమా అంటే కచ్చితంగా శృతి ఖాతాలో మరో విజయం పడ్డట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమా లో గెస్ట్‌ రోల్‌ లో కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే.

ఇక కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ చాలా కాలం తర్వాత ఒక సినిమాకు ఓకే చెప్పాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి కాకుండా శృతి హాసన్‌ ఆయన కు జోడీగా నటించబోతుంది.. ఇప్పటికే ఆమె తో చర్చలు జరిగాయి అనే వార్తలు కన్నడ మీడియా సర్కిల్స్‌ లో వస్తున్నాయి.

ఇక హిందీ సినిమాలు మరియు సిరీస్ లు కూడా ఆమె కమిట్‌ అవుతూనే ఉంది. మొత్తానికి బిగ్గెస్ట్‌ భారీ కమర్షియల్‌ విజయం లేకున్నా కూడా శృతి హాసన్‌ కి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సలార్‌ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండక పోవచ్చు అంటూ కొందరు అంటూ ఉన్నా కూడా ఆమె ఆఫర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.