శ్రుతిహాసన్ ఒంటరి ప్రయాణం ఎందుకో తెలుసా?
శ్రుతిహాసన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది.
By: Tupaki Desk | 5 Nov 2023 9:58 AM GMTశ్రుతిహాసన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. సక్సెస్ కి జూనియర్ ...సీనియర్ ఏముంది? అంతా ఒక్కటే అంటూ మార్కెట్ లో కొత్త ఐడెంటిటీని దక్కించుకుంది. `వాల్తేరు వీరయ్య`లో చిరంజీవి..`వీరసింహారెడ్డి` బాలయ్యతో నటించి విజయాలు అందుకోవడంతోనే ! శ్రుతి స్ట్రాటజీ కరెక్ట్ అనిపించింది. అప్పుడే మరోసారి అభిమానులకు అర్దమైంది మల్టీట్యాలెంటెడ్ గాళ్ అని ఎందుకు అన్నారో? శ్రతి హాసన్ ఎంట్రీకి ముందే మ్యూజిక్ బ్యాండ్ మెయింటెన్ చేసింది.
సింగర్ గా సత్తా చాటింది. ఆ తర్వాతే నటి అయింది. ఇప్పుడన్నీ రకాల పాత్రలతోనూ ఆకట్టుకుంటుంది. ఈ జర్నీతో పాటు ప్రేమ కలాపాల్లోన్న అమ్మడు ముందుటుందని ప్రూవ్ చేసింది. మైఖెల్ కోర్సలే తో బెడిసి కొట్టిన తర్వాత డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో కొత్త స్టోరీ మొదలు పెట్టింది. ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్న లవ్ స్టోరీ కూడా అదే. తాజాగా `ది ఐ` అనే ఇంగ్లీష్ సైకలాజికల్ చిత్రంలోనూ నటిస్తోంది.
ఇలా శ్రుతిహాసన్ నిత్యం బిజీగా ఉంటుంది. మరి ఇలాంటి టఫ్ షెడ్యూల్ నుంచి ఉపశమనం పొందడం ఎలా అంటే? రొటీన్ నుంచి బ్రేక్ తీసుకుని కొత్త ప్రదేశంలో వాలిపోతుందిట. అలా చేయడం వల్ల శారీరకంగా..మానసికంగా ఉన్న అలసట దూరమై మరింత ఉత్సాహంగా పనిచయగలం అంటోంది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల స్టప్ ఎంతో తెలుస్తుందిట.
ఇతరులపై ఆధారంపడకుండా సొంత పనలు ఎలా చేసుకోగల్గుతున్నాం..అన్ని పక్కాగా చేయగల్గు తున్నామా ? లేదా? అన్నది ఒంటరిగా ప్రయత్నించినప్పుడే తెలుస్తుంది అంటోంది. ఈప్రోసస్ లో కొత్త పరిచయాలు..వాళ్లతో మాట్లాడటం.. పుసక్తకాలు చదవడం..సరదాగా షాపింగ్ చేయడం వంటివి ఎన్నో విషయాలు తెలియజేస్తాయంటోంది. అందుకే శ్రుతి హాసన్ వీలైనంత వరకూ ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తుందిట.