చికిత్సకు డబ్బుల్లేక అనారోగ్యంతో నటి మృతి
కానీ క్యాన్సర్ తో ఆమె చేసిన పోరాటంలో మాత్రం విఫలం అయిన మృతి చెందింది. సింధు మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు
By: Tupaki Desk | 7 Aug 2023 11:04 AM GMT2010 సంవత్సరంలో అంజలి నటించిన 'షాపింగ్ మాల్' సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సింధు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. నాలుగు అయిదు సంవత్సరాల పాటు పలు సినిమాల్లో నటించిన సింధు 2020 సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడింది.
అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అయిన సింధు క్యాన్సర్ బారిన పడటంతో ఆమె చికిత్సకు డబ్బులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.
కొన్నాళ్లు సన్నిహితులు సాయం చేసినా కూడా మెరుగైన చికిత్స కోసం ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో మృతి చెందినట్లుగా ఆమె సన్నిహితులు అంటున్నారు.
చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కు మెరుగైన చికిత్స అవసరం అయినా కూడా డబ్బులు లేకపోవడంతో ఆమె మృతి చెందినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సింధు కు ఎవరు సాయం చేయలేదని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన సింధు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి అయిన ఏడాదిలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చిన్న వయసులోనే చాలా కష్టాలు పడ్డా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా సింధు మనో ధైర్యంతో పోరాడింది. కానీ క్యాన్సర్ తో ఆమె చేసిన పోరాటంలో మాత్రం విఫలం అయిన మృతి చెందింది. సింధు మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.