Begin typing your search above and press return to search.

హోమ్లీ హీరోయిన్ తొలి ప్రేమ కహానీ!

హోమ్లీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్నేహ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముంబై బ్యూటీ అయినా తెలుగింట హీరోయిన్ లా ప్రేక్ష‌కుల్ని అల‌రించింది

By:  Tupaki Desk   |   28 Sep 2023 8:39 AM GMT
హోమ్లీ హీరోయిన్ తొలి ప్రేమ కహానీ!
X

హోమ్లీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్నేహ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముంబై బ్యూటీ అయినా తెలుగింట హీరోయిన్ లా ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. ప్ర‌త్యేక‌మైన తెలుగు అభిమానుల్ని సొంతం చేసుకుంది. సౌంద‌ర్య‌..మీనా ల త‌ర్వాత త‌రం హీరోయిన్ల‌లో తెలుగులో అంత‌గా పాపుల‌ర్ అయింది స్నేహ మాత్ర‌మే. ముఖ్యంగా కుటుంబ నేప‌థ్యంగ‌ల సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సంపాదిం చుకుంది.

అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. ఇటీవ‌లే మ‌ళ్లీ కంబ్యాక్ అయింది. హీరోల‌కు అక్క‌..చెల్లి పాత్ర‌లు పోషిస్తుంది. గెస్ట్ రోల్స్ లోనూ ఆక‌ట్టుకుంటుంది. అయితే స్నేహ ఫేమ‌స్ అయిన రోజుల్లో సోష‌ల్ మీడియా లేదు. దీంతో ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన చాలా విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌వు. ప్ర‌స‌న్న కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా! అంత‌కు ముందు స్నేహ మ‌రో వ్య‌క్తిని ప్రేమించింది అన్న విష‌యాన్ని తాజాగా ఫిలిం క్రిటిక్ బైల్వాన్ రంగ‌నాధ్ తెలిపారు.

త‌మిళ ఇండ‌స్ట్రీలో ర‌వి అనే నిర్మాత‌తో స్నేహ తొలుత ప్రేమ‌లో ప‌డిందిట‌. వాళ్లిద్ద‌రి రిలేష‌న్ షిప్ చాలా కాలం కొనాసాగిందిట‌. పెద్దల అంగీకారంతో నిశ్చితార్దం కూడా చేసుకున్నారుట‌. అయితే ఆ త‌ర్వాత ర‌వి చిత్త‌శుద్ది లేని మ‌నిషి అని..నిజాయితీ ప‌రుడు కాద‌ని భావించి స్నేహ అత‌నికి దూర‌మ‌వ్వ‌డం మొద‌లు పెట్టిందిట‌. అలాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే జీవితం స‌క్ర‌మంగా సాగ‌ద‌ని భావించి ఆమె ర‌వికి కాల‌క్ర‌మంలో దూర‌మైందిట‌.

ఆ క్ర‌మంలో మానసికంగానూ ఎంతో క్షోభ‌కి గురైందిట‌. అప్ప‌టి నుంచి స్నేహ మ‌ళ్లీ ప్రేమ ..పెళ్లి ఆలోచ‌న కూడా చాలా కాలం పాటు రానివ్వ‌లేదుట‌. ప్ర‌స‌న్న కుమార్ ..స్నేహ‌ని ప్రేమించిన‌..అత‌న్ని కూడా చాలా కాలం పాటు ద‌గ్గ‌ర‌కు రానిచ్చేది కాద‌ని...ప్రేమ‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాలు ఆర‌ణంగా మ‌గాడిని న‌మ్మాలంటే భ‌య‌ప‌డేద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి ప్ర‌స‌న్న పై న‌మ్మ‌కం కుద‌ర‌డంతో ప్రేమ వివాహానికి అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.