Begin typing your search above and press return to search.

జూనియర్ ఐశ్వర్య ఏంటి ఇలా మారిపోయింది..?

ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్నేహా ఉల్లాల్ తెలుగులో జూనియర్ ఐశ్వర్య రాయ్ అంటూ పాపులర్ అయ్యింది

By:  Tupaki Desk   |   11 May 2024 5:50 AM GMT
జూనియర్ ఐశ్వర్య ఏంటి ఇలా మారిపోయింది..?
X

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్స్ కెరీర్ స్పాన్ ఎంతన్నది చెప్పడం కష్టం. కొందరు హీరోయిన్స్ దశాబ్ధం, రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగిస్తుండగా కొందరు మాత్రం కేవలం ఐదారు సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఉన్న కొన్నాళ్ల కెరీర్ లో అయినా సౌత్ ఆడియన్స్ అందరినీ అలరించే భామలు కొందరు ఉంటారు. అలాంటి వారిలో స్నేహా ఉల్లాల్ ఒకరు. బాలీవుడ్ సినిమా లక్కీ నో టైం ఫర్ లవ్ సినిమాతో తెరంగేట్రం చేసిన స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత వరుసగా 3 సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో కరుణాకరన్ డైరెక్షన్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా చేసింది. ఆ తర్వాత మంచు మనోజ్ తో నీ మనసు నాకు తెలుసు సినిమా చేసింది స్నేహా ఉల్లాల్.

ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్నేహా ఉల్లాల్ తెలుగులో జూనియర్ ఐశ్వర్య రాయ్ అంటూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నాగార్జున తో కింగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ సుశాంత్ తో కరెంట్ సినిమా చేసింది. సింహా, వరుడు, అలా మొదలైంది సినిమాల్లో నటించినా స్నేహా ఉల్లాల్ కెరీర్ ఊపందుకోలేదు. మధ్యలో కన్నడ, హిందీ సినిమాల్లో అవకాశాలు రాగా అక్కడ చేసిన స్నేహా ఉల్లాల్ యాక్షన్ 3డి, మడత కాజా, అంతా నీ మాయలోనే సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ దాదాపు ఫేడవుట్ అయిపోయింది. ఇక అడపాదడపా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తున్న స్నేహా ఉల్లాల్ లేటెస్ట్ గా తన ఫోటో షూట్ తో షాక్ ఇచ్చింది. ఈ మధ్యనే నేపాల్ లో ఒక ఈవెంట్ కు వెళ్లిన స్నేహా ఉల్లాల్ అక్కడ తన లుక్ అంటూ ఫోటోస్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక మరోపక్క ఆమె అందంగా తయారైన ఫోటోలను కూడా షేర్ చేసింది. కొన్ని కారణాల వల్ల ఈ ఫోటోలు షేర్ చేయలేదు అంటూ తన ఫోటోస్ కి కామెంట్ పెట్టింది స్నేహా.

మరి ఆ కారణాలు ఏంటో చెప్పలేదు కానీ స్నేహా ఉల్లాల్ ఆ ఫోటోస్ లో మాత్రం సూపర్ అనిపించేస్తుంది. తెలుగులో ఒక మోస్తారు ఇమేజ్ తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్ హిందీ, కన్నడ పరిశ్రమల్లో పనిచేసినా సరైన గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే స్నేహా ఉల్లాల్ లేటెస్ట్ లుక్ ఇబ్బంది పెడుతున్నా ఆమె దాచి పెట్టిన ఫోటో రివీల్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఒకప్పటి భామలంతా కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో స్నేహా ఉల్లాల్ కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.