Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ఇన్ సైడ్‌ కార్‌ అందాల ఆరబోత

ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఇంకా అందం విషయంలో కొత్త హీరోయిన్స్‌ కి ఏమాత్రం తీసిపోదు అనే విధంగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తుంది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 9:30 AM GMT
పిక్‌ టాక్‌ : ఇన్ సైడ్‌ కార్‌ అందాల ఆరబోత
X

తెలుగులో అలా మొదలైంది, ఉల్లాసంగా ఉత్సాహంగా, నేను మీకు తెలుసా, కరెంట్‌, సింహా సినిమాలతో పాటు ఇంకా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ స్నేహా ఉల్లాల్‌. కెరీర్‌ ఆరంభంలో ఆమె కళ్ల వల్ల జూనియర్ ఐశ్వర్య రాయ్ అంటూ పిలిపించుకున్న ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసినా కూడా దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన ఆఫర్లు రాలేదు అనేది ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఇంకా అందం విషయంలో కొత్త హీరోయిన్స్‌ కి ఏమాత్రం తీసిపోదు అనే విధంగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తుంది.

1985 సంవత్సరంలో ఓమన్‌ లోని మస్కట్‌ లో జన్మించిన ఈ అమ్మడి తండ్రి మంగళూరుకు చెందిన వ్యక్తి కాగా, తల్లి సింది కి చెందిన వ్యక్తి. ఓమన్‌ లోనే స్కూల్‌ పూర్తి చేసిన ఈమె తల్లితో పాటు ముంబైకి వచ్చి సెటిల్‌ అయ్యింది. చదువుకునే రోజుల్లోనే లక్కీ : నో టైమ్‌ ఫర్‌ లవ్‌ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కి జోడీగా నటించి మెప్పించింది. ఆ సమయంలోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాలో నటించడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టి ఈ అమ్మడి పై పడింది. బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు.. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

టాలీవుడ్‌ లో పలు సినిమాల్లో నటించినా కూడా కెరీర్ లో ఈ అమ్మడు తదుపరి స్థానం కు ఎదగడంలో విఫలం అయ్యింది. అందాల ఆరబోత తో రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో అందాల విందు ఫోటోలను షేర్‌ చేసి ఆకట్టుకుంది. ఈసారి కారులో కూర్చుని ఉన్న ఫోటోలను షేర్‌ చేసిన స్నేహా ఉల్లాల్‌ ఈసారి కూడా చూపు తిప్పుకోనివ్వడం లేదు. థైస్ అందాలను చూపిస్తూ, క్లీ వేజ్ షో అందాలను షేర్‌ చేసిన ఈ అమ్మడి ఫోటోలకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అంటూ మరోసారి ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.

సాధారణంగానే స్నేహా ఉల్లాల్‌ చూపులు గుండెలకు గుచ్చుకుంటున్నాయా అన్నంత వాడిగా ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా కవ్వించే చూపులతో హొయలు పోతూ ఈ అమ్మడు కారు లో కూర్చుని ఇచ్చిన ఫోటో ఫోజ్‌ లు కుర్రకారు గుండెలు బేజారు అయ్యేలా చేస్తున్నాయి. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా బాబోయ్‌ మరీ ఇంతటి అందాల ప్రదర్శన ఏంటి.. మరీ ఇంత అందం ఏంట్రా బాబు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఫోటోలను లైక్ చేసి షేర్‌ చేస్తున్నారు.

ఈ ఫోటోలతో పాటు స్నేహా ఉల్లాల్‌ స్వతంత్రంగా ఉండడం నేర్చుకోవడమే మీ కోసం మీరు చేసే గొప్పదనం అంటూ కోట్‌ ను జత చేసింది. ఈతరం అమ్మాయిలు స్వతంత్రంగా ఉండాలి అనుకోవాలి, అందుకు తగ్గట్టుగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో స్నేహా ఉల్లాల్‌ చేసిన ఈ కామెంట్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆకట్టుకునే అందం తో పాటు ఇలాంటి మెచ్యూరిటీ కామెంట్స్ చేయడం ద్వారా మరింత మంది అభిమానం ను ఈ అమ్మడు సొంతం చేసుకుంటుంది అంటూ నెటిజన్స్ తో పాటు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.