ఆ విషయంలో తెలుగమ్మాయి ఇంత వీకా?
తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 4 May 2024 8:10 AM GMTతెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఎంట్రీనే బాలీవుడ్ లో జరిగింది. `రామన్ రాఘవ 2.0`..`చెఫ్` లాంటి సినిమాలో హిందీ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. స్పై థ్రిల్లర్ `గూఢచారి`లో అవకాశం రావడంతో ఇక్కడ ఆమె లైఫ్ ఒక్కసారిగా కొత్త టర్నింగ్ తీసుకుంది. తొలి విజయంతోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది.
అమ్మడి పెర్పార్మెన్స్...బ్యూటీ ప్రతిది శోభితని ప్రత్యకంగా హైలైట్ చేసింది. అటుపై మలయాళం..తమిళ చిత్రాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ రకంగా శోభిత పాన్ ఇండియాలో ఓ వైబ్రేషన్ గా కనిపించింది. ఏ భాషని ప్రత్యేకంగా టార్గెట్ చేయకుండా అన్ని భాషలు నావే అంటూ అన్ని పరిశ్రమ ల్లోనూ తనదైన ముద్ర వేసిం ది. `మేజర్` విజయంతో ఇండియా అంతటా మరోసారి పాపులర్ అయింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్ని యన్ సెల్వన్` లో సైతం నటించి సత్తా చాటింది.
ఇటీవలే రిలీజ్ అయిన` మంకీ మ్యాన్` సినిమాతో హాలీవుడ్ లో సైతం నటించింది. ఇంగ్లీష సినిమా చేసింది అనే పేరు తప్ప ! అమ్మడి పాత్రకైతే పెద్దగా రెస్పాన్స్ రాలేదు. రోల్ చిన్నది కావడంతో పేరుకి నటించింది అనే తప్ప! పెద్దగా హైలైట్ అవ్వలేదు. కానీ ఓ తెలుగు నటి అంతవరకూ వెళ్లడం అన్నది గొప్ప విషయం. అందుకు శోభితని మెచ్చుకోవాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఉందంది.
ఎక్కువగా తన పక్కవారిపైనే ఆధార పడతానంది. చిన్న చిన్న ఆనందాలకి పొంగిపోతానని...కొన్ని సందర్భాల్లో ఎంతో చిన్న పిల్లగాను మారిపోతానంది. తాను చేసే సినిమా పాత్రల్లోలా వ్యక్తిగత జీవితంలో స్ట్రాంగ్ కాదని తెలిపింది. ఇక అమ్మడు ఇంతవరకూ ప్రేమలో పడినట్లు కనిపించలేదు. ఆ మధ్య ఓ టాలీవుడ్ హీరోతో పడిందని ప్రచారం సాగింది గానీ అది స్నేహమా? ప్రేమ అన్నది ఇప్పటికీ క్లారిటీ లేని అంశమే.