36 ఏళ్ల వయసులో గ్యాప్ ఇలా ఎంతమంది చేయగలరు?
అనీల్ కపూర్ వారసురాలిగా `సావారియాతో ` ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ 15 ఏళ్ల పాటు ఎక్కడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Oct 2023 12:30 PM GMTఅనీల్ కపూర్ వారసురాలిగా `సావారియాతో ` ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ 15 ఏళ్ల పాటు ఎక్కడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే అమ్మడు తనదైన ముద్ర వేసింది. అటుపై వరుస అవకాశాలతో బిజీ నాయికగా మారింది. చాలా తక్కువ సమయంలోనే సోనమ్ బాలీవుడ్ లో సత్తా చాటింది. అయితే 2020 తర్వాత ఒక్కసారిగా కనుమరుగైంది. మూడేళ్ల పాటు ఎలాంటి సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
పెళ్లి అటుపై ఓ బిడ్డకు జన్మనివ్వడంతో! కుటుంబ జీవితానికే అంకితమైంది. ఇటీవలే` బ్లైండ్` అనే సినిమాతో మళ్లీ కంబ్యాక్ అయింది. అయితే సోనమ్ ఏర్పరిచిన ఈ గ్యాప్ విషయంలో చాలా సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటిని సోనమ్ నివృతి చేసింది.` గ్యాప్ రాలేదు..జస్ట్ కావాలనే తీసుకున్నాను` అంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫ్యామీలితో ఎక్కువ సమయం గడపలేకపోయాను.
అందుకే బిడ్డ పుట్టిన తర్వాతైనా కుటుంబంతో గడపాలనిపించి కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకున్నాను. 17 ఏళ్ల వయసులో నటన మొదలు పెట్టి 36 ఏళ్ల వయసులో గ్యాప్ ఇచ్చాను. ఇప్పటికే నటించిడం కోసం చాలా సమయం వెచ్చించాను. మళ్లీ ఇప్పుడు తిరిగి రావడానికి సిద్దంగా ఉన్నాను. ఈ ఏడాదితో అది మొదలైంది. సినిమాల పరంగా చాలా మిస్ అయ్యాను. కానీ నా బిడ్డతో ..కుటుంబం తో గడిపిన ఏక్షణాన్ని మర్చిపోలేను.
ప్రతీ మూవ్ మెంట్ ఓ మధుర జ్ఞాపకం. కేవలం కుటుంబంతో మాత్రమే ఉంటేనే అలాంటి జ్ఞాపకాలు దొరుకుతాయి. ఏదైనా సినిమా వేడుకలు జరిగేటప్పటప్పుడు మీడియా ద్వారా నాకు మెసెజ్ లు పంపేవారు. ఎప్పుడు తిరిగి నటిస్తావని అడిగేవారు. నన్ను మిస్ అవుతున్నానని చెప్పేవారు. ఆ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించేది. ఎందుకంటే వారు ఎంతగా ప్రేమిస్తున్నారో? నాకు అప్పుడే బాగా అర్ధమైంది. ప్రస్తుతం సోనమ్ కపూర్ `బ్యాటిల్ ఫర్ బిట్టోరా` అనే నవల అధారంగా అదే టైటిల్ తో ఓ పీచర్ ఫిల్మ్ తో అలరించేందుకు రెడీ అవుతోంది.