శ్రీలీల డెడికేషన్ కి రీజన్ ఇదే..!
తను ఇప్పుడు అలా సూపర్ గా డ్యాన్స్ వేయడానికి చిన్నప్పటి నుంచే చాలా కష్టపడింది. ఊహ తెలిసినప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉంది.
By: Tupaki Desk | 27 Aug 2023 8:08 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ ఎవరు అంటే, ముందుగా వినపడేది శ్రీలీల పేరే. ఊపిరి తీసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శ్రీలీలకు ఉన్న క్రేజ్ అలాంటిది. స్టార్ హీరోల నుంచి, యంగ్ హీరోల వరకు అందరూ తమ సినిమాల్లో శ్రీలీలే ఉండాలని అనుకుంటున్నారు. అందుకు తగినట్లుగానే ఆమె కూడా మంచి కథలు ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది.
కేవలం నటన మాత్రమే కాదు, ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ అయినా ఇరగదీయగలదు.తను ఇప్పుడు అలా సూపర్ గా డ్యాన్స్ వేయడానికి చిన్నప్పటి నుంచే చాలా కష్టపడింది. ఊహ తెలిసినప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉంది. అంతేకాకుండా, తన వ్యక్తిగత విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు.
తాను అసలు సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని చెప్పింది. ఎన్ని సినిమాలు చేసినా, చివరకు తాను డాక్టర్ ని మాత్రం అయ్యితీరతానని చెప్పింది. కొన్నిసార్లు అటు సినిమాలు, ఇటు చదువు రెండింటినీ బ్యాలెన్స్ చేసే సమయంలో కష్టంగా అనిపించేదని, అయినా కూడా ఇష్టంగా చేస్తున్నట్లు చెప్పింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చదువు మాత్రం పక్కన పెట్టనని తన తాత గారిని మాట ఇచ్చానని, అందుకోసమే కష్టపడుతున్నానని, ఎంబీబీఎస్ పూర్తి చేసి తీరతానని ఆమె చెప్పారు. ఇప్పటికీ చాలా మంది శ్రీలీల డెడికేషన్ చూసి షాకైపోతూ ఉంటారు. కానీ, వాళ్ల తాతకు ఇచ్చిన మాటే ఆమె డెడికేషన్ కి కారణం అని తెలుస్తోంది.
ఇక తాను చిన్నతంలో తన అమ్మమ్మ దగ్గర పెరిగినట్లు చెప్పారు. వాళ్ల అమ్మ స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ అట. దీంతో, అమ్మమ్మ దగ్గర ఒంగోలులో పెరిగిందట. తనకు చిన్నతనంలోనూ చదువు, డ్యాన్స్ తప్ప మరో ప్రపంచం లేకుండా పెంచారట. ఇక, జ్వరం వచ్చినా కూడా వాళ్ల అమ్మమ్మ స్కూల్ కి పంపించేదట. స్కూల్ ఎగ్గొట్టడానికి తాను చంకలో ఉల్లిపాయలు పెట్టుకొని మరీ ప్రయత్నించేదానిని అని, అయినా, వాళ్ల అమ్మమ్మ వదిలి పెట్టేది కాదని చెప్పింది.
ఇక, ఒక్క ఫోటో తన జీవితం మార్చేసిందని చెప్పింది. ప్రతి సంవత్సరం తన అన్నయ్యలతో వాళ్లమ్మ ఫోటోషూట్స్ చేయించేదట. కేజీఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన గౌడ శ్రీలల ఫ్యామిలీ ఫ్రెండ్ అట. ఆయన శ్రీలీల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, హీరోయిన్ గా ఆఫర్లు రావడం మొదలయ్యాయట. అలా ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మన అందరినీ అలరిస్తోంది.