బాలయ్యని సొంత బాబాయ్ లా ఫీలైన శ్రీలీల!
యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియర్..జూనియర్స్ స్టార్స్ అంటూ ఎవర్నీ విడిచిపెట్టడం లేదు
By: Tupaki Desk | 5 Sep 2023 12:30 AM GMTయంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియర్..జూనియర్స్ స్టార్స్ అంటూ ఎవర్నీ విడిచిపెట్టడం లేదు. ఏ హీరోతో ఛాన్స్ వచ్చినా సై అని ముందుకెళ్లిపోతుంది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు సిస్టర్ రోల్స్..సెకెండ్ లీడ్ లంటూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. అమ్మడి తాజా లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తెలుగులో ఏ భామ లేనంత బిజీగా ఉంది.
డే బై డే సొగసరికి మార్కెట్లో మాస్ ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ల లీగ్ కి అతి చేరువలో ఉంది. 'గుంటూరు కారంలో' ఛాన్స్ అందుకోవడంతో కెరీర్ పరంగా మరో అడుగు ముదుకు పడింది. ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడి రేంజ్ మారిపోతుందని ప్రచారం షురూ అయింది. మరోవైపు 'భగవంత్ కేసరి' లో నటసింహ బాలకృష్ణ తమ్ముడి కుమార్తె పాత్ర పోషిస్తుంది.
ఆ రకంగా బాలయ్యని సినిమాలో బాబాయ్ అని అభిమానంతో పిలుచుకుంటుంది. మరి ఈ అభిమానం సినిమా వరకేనా? తెర వెనుక కూడా బాబాయ్ లా పీలవుతుందా? అంటే అలాగే ఫీలవుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. 'ఈ సినిమా చేస్తున్నంతసేపు బాలయ్య సార్ నాకు సొంత బాబాయ్‌లాగే అనిపించారు. సెట్ లో ఎంతో బాగా చూసుకున్నారు. చాలా ఆప్యాయంగా పలకరించేవారు.
మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉంది. ఈ విషయం కూడా ఆయనకు చెప్పాను. తప్పకుండా అని ప్రామిస్ చేసారు. సెట్ లో ఆయన నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన రెస్పెక్ట్ కి ఫిదా అయిపోయాను' అంది. ఈ బ్యూటీ మంచి నటే కాదు..అంతకు మించి గొప్ప మాటకారి కూడా అని ఇప్పటికే నిరూపించింది. తనదైన చలాకీ తనంతో రష్మిక లా అభిమానుల్ని ఆకట్టుకోవడంలో ముందుంటుంది. ఈనేపథ్యంలోనే శ్రీలీలకి సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఏర్పడింది.