Begin typing your search above and press return to search.

పవనా..మహేశా..? శ్రీలీలకు కఠినమైన ప్రశ్న

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్స్ లోకి వస్తోంది. వరుస వాయిదాలు పడుతూ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకి ఈ మూవీ రాబోతోంది

By:  Tupaki Desk   |   19 Nov 2023 8:21 AM GMT
పవనా..మహేశా..? శ్రీలీలకు కఠినమైన ప్రశ్న
X

ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న అందాల భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తరువాత రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రామ్ పోతినేని స్కంద డిజాస్టర్ అయిన వెంటనే భగవంత్ కేసరి మూవీతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆదికేశవ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్స్ లోకి వస్తోంది. వరుస వాయిదాలు పడుతూ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకి ఈ మూవీ రాబోతోంది.మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రస్తుతం నడుస్తున్నాయి. వైష్ణవ్ తేజ్, శ్రీలీల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లేట్ గా రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమాకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇంటర్వ్యూలో భాగంగా సంగీత శోభన్ శ్రీలీలని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఆమె ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తోంది. ఈ ఇద్దరి హీరోలలో మీ ఫస్ట్ ఛాయస్ ఎవరు అని సంగీత శోభన్ అడిగారు. దీనికి శ్రీలీల ఏ మాత్రం సంబంధం లేకుండా ఆన్సర్ చెప్పి షాక్ ఇచ్చింది.

ఆ ఆ ప్రశ్నకి కంప్లీట్ గా సమాధానం దాటవేస్తూ ఆదికేశవ మూవీ నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. సినిమా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడండి అంటూ శ్రీలీల సమాధానం ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. నాన్ సింక్ లో ప్రశ్న వేసిన శ్రీలీల మాత్రం సింక్ లో సమాధానం చెప్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్స్ ని ఈ మధ్యకాలంలో ఇలా ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేసినపుడు లేదంటే సక్సెస్ ఫుల్ సినిమా హీరోతో కొత్త సినిమా హీరోని కంపారిజన్ చేస్తూ ఏ హీరో మీకు బెస్ట్ అంటూ అడగడం కామన్ గా మారింది. అయితే ఎలాంటి విషయాలు హీరోయిన్స్ కూడా తెలివిగానే నొప్పించక తప్పుకుంటూ మాట్లాడుతూ ఉండటం విశేషం.