మహేష్ ను చూసి డైలాగ్స్ మర్చిపోయా: శ్రీలీల
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం నిర్వహించారు
By: Tupaki Desk | 9 Jan 2024 4:39 PM GMTమహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం నిర్వహించారు. ఇక వేడుకలో శ్రీలీల తన మాటలతో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీలీల మాట్లాడుతూ ఈ రెస్పాన్స్ చూస్తూ ఉంటే మహేష్ బాబు గారిని అందరూ ఎంతగా ఇష్టపడతారో అర్థమైంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారి లాంటి గొప్ప దర్శకులతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొక కొత్త తరహాలో ఎంట్రీ ఇచ్చినట్లుగా అనిపిస్తోంది.
థాంక్యూ సో మచ్.. త్రివిక్రమ్ గారు అమ్ము అనే మీ క్యారెక్టర్ ను నా చేతిలో పెట్టినందుకు. అలాగే మా టార్చర్ ను సెట్ లో భరించినందుకు అలాగే ఇప్పుడు మాకు గైడ్ చేసినందుకు మరోసారి థాంక్యూ సో మచ్ సర్. ఇక మహేష్ బాబు గారు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తూ నేను చాలాసార్లు డైలాగ్స్ కూడా మర్చిపోయాను. నాతో ఓపికతో ఉన్నందుకు చాలా థాంక్స్.
నేను మొదటి రోజు షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆయన ఎలా ఉంటారు అని అడిగారు. అప్పుడు నా మనసులో నుంచి ఒకటే సమాధానం వచ్చింది. ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఆయన ఉంటారు. బయటనుంచి కాదు ఆయన మనస్సు కూడా అంతే.. అని నేను మా వాళ్లతో చెప్పాను. నేను చాలా లక్కీ. నేను కూడా అక్కడ ఏదో జనాల్లో ఉండాల్సిన అమ్మాయిని. కానీ దేవుడేదో వాళ్ళ మనసులో ఉన్నవి అన్నీ నేను చెప్పాలి అని, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు అని అనుకుంటున్నాను.
అలాగే డిఓపి మనోజ్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఎప్పటికీ గుర్తు ఉంటుంది. 'ఏరా కోడి కూర పులుసెట్టనా..' అనే ఫస్ట్ డైలాగ్ నాకు ఇంకా గుర్తు ఉంది. అంత నాటుగా ఉంటుంది ఈ సినిమా. ఇక ఈ గుంటూరు కారం సినిమాలో కాస్త తీయగా అమ్ము అనే క్యారెక్టర్ థియేటర్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఇందులో నటించిన మీనాక్షి కూడా చాలా బాగా నటించింది. ఆ అమ్మాయి చాలా స్వీట్. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. చిన్న బాబు గారు వంశీ గారు మొత్తం టీంకు కూడా థాంక్యూ సో మచ్.. అని శ్రీలీల తెలియజేశారు.