Begin typing your search above and press return to search.

అక్కడుంటే అదే ఆలోచన : శ్రీలీల

రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:30 PM GMT
అక్కడుంటే అదే ఆలోచన : శ్రీలీల
X

రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న శ్రీలీల హీరోయిన్ గా తెలుగు లో వరుసగా నటిస్తోంది. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ధమాకా సినిమాతో ఈ అమ్మడు మొదటి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ధమాకా సినిమా తో వచ్చిన సక్సెస్ ను సద్వినియోగం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఆ మధ్య ఈ అమ్మడు ఏకంగా అర డజను సినిమాలను వరుసగా చేసింది. తాజాగా సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వరుస సినిమాలతో జోరు మీదున్న శ్రీలీల తాజాగా చిట్ చాట్ లో ఫ్యాన్స్ తో పలు విషయాలను పంచుకుంది. సినిమా సెట్స్ లో ఉన్న సమయంలో తాను సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి తప్ప మరే విషయాలను ఆలోచించను. అందుకే తాను పాత్ర విషయంలో మరియు డాన్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టగలను అంటూ చెప్పుకొచ్చింది.

షూటింగ్ సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచిస్తే కచ్చితంగా ఆ ప్రభావం నటన పై పడుతుంది. అందుకే తాను సెట్స్ లో ఓపెన్‌ మైండ్ తో ఉంటాను. చేయబోతున్న షాట్‌ గురించే ఆలోచిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలోనే షాట్‌ ని పూర్తి చేసేందుకు హోం వర్క్ చేస్తానని కూడా పేర్కొంది.

చదువు విషయంలో కూడా తాను అలాగే ఉంటాను అంది. చదివేందుకు పుస్తకం ముందు పెట్టుకుంటే చదువు విషయం తప్ప మరేమి కూడా తాను ఆలోచించను అంటూ చెప్పుకొచ్చింది. తాను పుస్తకం పట్టి చదవడం మొదటి పెట్టాను అంటే ఇతర విషయాలు ఏవీ కూడా నాకు గుర్తుకు రావు అంది. ఒక పని చేసే సమయంలో మరో విషయం ఆలోచించకపోవడం మంచి అలవాటే అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.